Home / health / ఇంట్లోనే తయారు చేసుకునే ఈ మిశ్రమాన్ని తాగితే..! ఎముకలు ఉక్కులా మారుతాయి.

ఇంట్లోనే తయారు చేసుకునే ఈ మిశ్రమాన్ని తాగితే..! ఎముకలు ఉక్కులా మారుతాయి.

Author:

రోజురోజుకి మారిపోతున్న ఈ కాలంలో లేచినప్పటి నుండి వివిధ రకాల ఒత్తిడిలతో సతమతమవుతూ ఎప్పుడు తింటామో, ఎప్పుడు నిద్రపోతామో కూడా సరిగా తెలియదు, దానితో వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయి, ఈ కాలంలో ఎక్కువమంది సరియైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తున్నాయి, ముఖ్యంగా ఎముకలు బలహీనంగా అవుతున్నాయి, అందువల్ల నడుం నొప్పి, కీళ్ల నొప్పులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మన ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పని అయిన చేయగలుగుతాం.

మన శరీరంలో ఎముకలలో కాల్షియం తగ్గిపోయి బలహీనంగా అయ్యాయి అని తెలిస్తే వెంటనే మెడికల్ షాప్ కి వెళ్లి కెమికల్స్ తో కూడిన కాల్షియం ట్యాబ్లేట్ ని వేసుకుంటాం వాటివల్ల వేరే రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది, కానీ పూర్వ కాలంలో ఎముకలని బలంగా చేయడానికి కెమికల్స్ తో కూడిన ట్యాబ్లేట్స్ అంటూ ఏమి లేవు, సహజంగా దొరికే పదార్థాలతోనే వారు ఎముకలని బలంగా చేసుకునేవారు, అందుకే వారు చాలా బలంగా ఉండి ఎక్కువకాలం ఆరోగ్యంగా బతికేవారు, వారు అప్పుడు ఉపయోగించిన పద్ధతినే ఇప్పుడు ఆయుర్వేద వైద్యంలో కూడా వాడుతున్నారు, ఈ పదార్థాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

how-to-strengthen-bones-naturally

కావాల్సిన పదార్థాలు:

  • 50 గ్రాముల గోధుమరవ్వ
  • 50 గ్రాముల పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు(Sun flower seeds)
  • 3 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష
  • 3 టేబుల్ స్పూన్ల నువ్వులు
  • 50 గ్రాముల గుమ్మడికాయ గింజలు
  • 1 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు
  • ఒక కిలో తేనె

తయారు చేయు విధానం:

ముందుగా స్వచ్ఛమైన తేనెని తీసుకోని ఒక పెద్ద గిన్నెలో పోయాలి, దానిలో నువ్వులు, అవిసె గింజలు, ఎండు ద్రాక్షలని వేసి బాగా కలపాలి, ఆ తరువాత గోధుమ రవ్వని, పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలని వేసి బాగా కలపాలి, బాగా కలపగా వచ్చిన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచాలి.

ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కు ముందు ఒక టీస్పూన్ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల కాల్షియం పెరిగి ఎముకలు గట్టిపడతాయి. దీంతోపాటు కీళ్లు, మోకాళ్ల మధ్య అరిగిపోయిన జిగురులాంటి పదార్థం తిరిగి పెరుగుతుంది. మజిల్, జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తుంది.

(Visited 19,406 times, 1 visits today)