Home / Inspiring Stories / ప్రామిస‌రీ నోటు రాసుకునేటప్పుడు ఈ నిబంధనలు పాటించకపోతే చాలా నష్టపోతారు.

ప్రామిస‌రీ నోటు రాసుకునేటప్పుడు ఈ నిబంధనలు పాటించకపోతే చాలా నష్టపోతారు.

Author:

ఇతరుల నుండి అప్పు తీసుకున్నప్పుడు లేదంటే ఇంకేదైన ఆర్ధిక సహాయం పొందినప్పుడు దానికి రుజువుగా అప్పు తీసుకున్న వారు ప్రామిస‌రీ నోటు రాసి ఇవ్వడం ఆనవాయితి. కాని ఆ ప్రామిసరీ నోటును రాసేటప్పుడు కొన్ని నియమ నిభందనలు పాటించాల్సి ఉంటుంది లేదంటే అందులోని తప్పుల వలన రుణ దాత‌లు ఇబ్బందులు ప‌డ‌టమే కాకుండా ఆ ప్రామిసరీ నోటు చెల్లకుండా పోతుంది. అందుకే ప్రామిస‌రీ నోటు రాసుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు ఎమిటో క్రింద చదవండి.

promissory note

ప్రామిస‌రీ నోటు రాసుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు:
1. ప్రామిస‌రీ నోటు లిఖితపూర్వ‌కంగా ఉండాలి.
2. అప్పు ఇచ్చిన మరియు తీసుకునే వారి పేర్లు ప్రభుత్వం జారి చేసినా ఎదైనా గుర్తింపు కార్డులో పేర్కొన్న విధంగా తప్పులు లేకుండా స్ప‌ష్టంగా ఉండాలి.
3. ప్రామిస‌రీ నోటు ఏ కారణంతో రాసి ఇస్తున్నారో స్ప‌ష్టంగా ఉండాలి.
4. ప్రామిస‌రీ నోటు రాసిన స్థ‌లం మరియు తేదీల‌ను ఖచ్చితంగా పేర్కొనాలి.
5. అప్పు తీసుకున్న సొమ్ము అంకెల్లోనూ, అక్ష‌రాల్లోనూ రాయాలి.
6. రెవెన్యూ స్టాంప్ అంటించి సాక్షుల సమక్షంలో రుణ గ్రహీత సంత‌కం చేయాలి, ఆ తరువాత సాక్షుల సంతకాలు కూడా ప్రామిస‌రీ నోటు పై చేయించాలి.
7. అప్పు తిరిగి ఎప్పుడు, ఏ విధంగా చెల్లిస్తారో? ఆ వివరాలు పొందుపరచాలి.
8. అప్పు డబ్బు ఏ విధంగా స్వీకరించారో అనగా న‌గ‌దు ద్వారా ముట్టిన‌దో, చెక్కుద్వారా ముట్టిన‌దో రాయాలి.
9. ఇచ్చిన అప్పుకి వడ్డీ మరియు ఇతర షరతులు స్ప‌ష్టంగా పేర్కొనాలి.

(Visited 26,484 times, 1 visits today)