Home / General / గుండెనొప్పి వస్తే..ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నడిరోడ్డుపై దించేశారు..!

గుండెనొప్పి వస్తే..ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నడిరోడ్డుపై దించేశారు..!

Author:

పక్క మనిషికి ఏమి అయితే మనకేంది..మనం మంచిగుంటే చాలు..అనే స్వార్ధపూరిత నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం బయలైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జరిగింది, ఆర్టీసీ డ్రైవర్, కండెక్టర్..ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి తన కొడుకు చేతిలోనే తుది శ్వాస విడిచాడు, కళ్ళ ముందే ఒక వ్యక్తి చావుబతుకుల మధ్య ఉన్న కూడా ఏమాత్రం మానవత్వంతో ఆలోచించకుండా మనకి అవసరంలేదులే అనుకోని మధ్యలోనే వదిలేసినా అవమానవీయ సంఘటన వైరల్ గా మారింది, అస్వస్థతతో ఉన్న వ్యక్తిని దారి మధ్యలో దించేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, గుండెనొప్పితో బాధపడుతున్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నిరాకరించిన ఆటో డ్రైవర్లు ఒక నిండు ప్రాణం పోవడానికి కారకులయ్యారు. కళ్లముందే.. కన్నతండ్రి గుండెపట్టుకుని విలవిలలాడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ కుమారుడు పడిన బాధ వర్ణనాతీతం. చూసిన వారు అయ్యో పాపం అన్నారే తప్ప వారికి మాత్రం సాయం చేసే పరిస్థితి లేదు. విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర డిసెంబర్ 20వ తేదీ (బుధవారం) జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

rtc-driver-and-auto-driver-killed-a-person

ఎల్ఐసీ ఏజెంట్ గా పనిచేస్తూ శ్రేకాకుళంలో ఉండే అచ్యుత్ (50) గత వారం రోజుల నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు, విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చూపించింకుందాం అని తన కొడుకు విష్ణుతో కలిసి బుధవారం(Dec 20) నాడు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు, బస్సు భోగాపురం ఫ్లై ఓవర్ దగ్గరికి చేరుకోగానే అచ్యుత్ గుండె నొప్పి వస్తుందని కొడుకుకి చెప్పడంతో విష్ణు వెంటనే ఆస్పత్రి దగ్గర్లో ఉంటే ఆపాలని కండక్టర్‌ను, డ్రైవర్ ను కోరాడు. అయితే చాకివలస చౌరస్తా దగ్గరకు వచ్చేసరికి అచ్యుత్‌కు నొప్పి ఎక్కువ కావడంతో విష్ణు వేగంగా వెళ్లాలని డ్రైవర్ ను వేడుకున్నాడు. విష్ణు ఆందోళన అర్ధం చేసుకోవాల్సిన కండెక్టర్, డ్రైవర్ ఏమాత్రం మానవత్వం లేకుండా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించి బస్సును ఆస్పత్రికి తీసుకుపోకుండా మధ్యలోనే బస్సును ఆపి నడిరోడ్డుపై బలవంతంగా దింపేశారు. దీంతో రోడ్డున వెళ్లే ఆటోల కోసం ప్రయత్నించాడు. ఏ ఆటో డ్రైవర్ కూడా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. ఓ ఆటో డ్రైవర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ముందుకు వచ్చాడు. కొంచెం దూరం తీసుకెళ్లిన తర్వాత.. అచ్యుత్ రావు పరిస్థితి గమనించి.. ఆ డ్రైవర్ కూడా మధ్యలోనే బలవంతంగా దింపేశాడు. నడిరోడ్డుపైనే కన్నకొడుకు చేతిలోనే.. ఆ తండ్రి చివరి శ్వాస విడిచాడు.

ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలనే ఆసుపత్రులున్నాయి, బస్సు డ్రైవర్ , ఆటో డ్రైవర్ లలో ఒక్కరైనా మానవత్వంతో ఆలోచించి సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్ళుంటే ఒక ప్రాణం నిలబడేది, “మాయమై పోతున్నడమ్మ మనిషన్న వాడు.. మచ్చుకైనను లేదు చూడు మానవత్వం ఉన్నవాడు” అని ఓ మహాకవి అన్నట్లు నిజంగానే సమాజంలో మానవత్వం మాయమైంది అనడానికి గాల్లో కలిసిన అచ్యుత్ ప్రాణమే రుజువు..!

(Visited 367 times, 1 visits today)