Home / Political / హైదరాబాద్ చేరిన సైకో సూది..

హైదరాబాద్ చేరిన సైకో సూది..

Author:

గత కొన్నాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టిస్తున్న సూది సైకో తెలంగాణా చేరాడా? ఈరోజు మల్కాజ్ గిరిలొ ఒక బాలిక పై సూది దాడి జరగటం తో ఇదే అనుమానం భాగ్యనగర ప్రజలందరిలోనూ కలుగుతోంది. కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ ని వణీకించిన ఈ సైకో సూది పోలీసులకు దొరక కుండా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఎప్పుడు వస్తాడొ తెలీదు ఎలా వస్తాడో తెలీదు… ఎలా ఉంటాడో అంతకన్నా తెలీదు. ఇప్పటికే రెండు సార్లు ఊహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అసలు ఈ సైకో ఒక్కడేనా లేక కొంతమంది కలిసి ఇలా భయొత్పాతాలని సృష్టిస్తున్నారా అన్నది కూడా అర్థం కావటం లేదు…

దారిలో వొంటరిగా నడుచుకుంటూ వెళ్ళే బాలికల వెనుకగా వచ్చి ఇంజక్షన్ చేసి వెంటనే అక్కన్నుంచి పారిపోతున్న ఈ సైకో మొహాన్ని ఇప్పటివరకూ ఎవరూ చూళ్ళేదు. అతను ఇంజక్షన్ ఇవ్వగానే కొందరు కళ్ళు తిరిగి పడిపోతే ఇంకొందరికి మాత్రం ఏమీ కాలేదు. ఐతే ఈ సైకో ఏదైనా ప్రమాద కర వైరస్ ని గానీ, ఆడపిల్లల శరీరం లోకి ఏదైనా ప్రమాదకర స్లోపాయిజన్ లాంటిది  ని ఇంజెక్ట్ చేస్తున్నాడా? అనే అనుమానాలూ వినబడుతున్నాయి.ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల గాలింపు తీవ్రం కావటం తో సైకో ఇప్పుడు హైదరా బాద్  చేరుకున్నాడా? ఈప్రశ్న ఇప్పుడు పోలీసులని పరుగులు తీయిస్తోంది.  ఉదయం మల్కాజ్ గిరిలో. స్థానిక డిల్లి మోడల్ స్కూల్ లో చదివే రమ్య అనే చిన్న పిల్ల మీద దాడిచేస్తునడగా సీ.సీ. కెమెరాకి చిక్కాడు ఐతే మొహం సరిగా కనిపించటం లేదు.

ఐతే ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపిన సైకో సూది నే ఇక్కడికి వచ్చాడా లేక ఇక్కడ కొత్తగా ఎవరైనా తయారయ్యారా అనేది కూడా తెయటం లేదు. ఈ సూది సైకోని పట్టుకోవటం లో ఆంధ్రా పోలీస్ విఫలమయ్యారని విమర్షలు వచ్చిన నేపథ్యం లో తెలంగాణా పోలీస్ అప్రమత్తమయ్యారు. స్పృహలొకొచ్చిన బాలిక తన వెనుకగా వచ్చి ఇభుజం పై ఇంజక్షన్ ఇచ్చాడనీ మొహానికి కర్చీఫ్ కట్టుకున్నాడనీ చెబుతోంది.ఆడపిల్లలని వొంటరిగా బయటికి పంపొద్దనీ అనుమానం గా ఎవరు కనిపించినా దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో చెప్పాలనీ చెబుతున్నారు పోలీసులు.

(Visited 106 times, 1 visits today)