Home / Inspiring Stories / భారతదేశంలో అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న నగరం: హైదరాబాద్

భారతదేశంలో అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న నగరం: హైదరాబాద్

Author:

భారతదేశంలో చాలా విషయాలలో మన హైదరాబాద్ ముందుకు దూసుకుపోతుంది, దానిలో భాగంగానే ఇప్పుడు భారతదేశంలో అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న నగరంగా ఎంపికైంది. ఈ లిస్ట్ లో వరుసగా మూడు సార్లు మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది హైదరాబాద్. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాలలోని జీవన నాణ్యత ప్రమాణాలపై అధ్యయనం చేసిన గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ తన నివేదికలో ఈ వివరాలను ప్రకటించింది. దేశంలో సాంప్రదాయ వాణిజ్య నగరాలైన ముంబై, ఢిల్లీ లను క్రిందకు నెట్టి హైదరాబాద్, పుణె జీవన నాణ్యతలో ముందు నిలిచాయి.

hyderabad no 1 city in india

ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఆస్ట్రియా రాజధాని వియన్నా నగరం ఈ నివేదికలో ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఎనిమిదేళ్లుగా వరుసగా టాప్ లో అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న నగరంగా వియన్నా కొనసాగుతోంది. టాప్ టెన్ లిస్ట్ లో జ్యూరిచ్ సెకండ్ ప్లేస్ లో ఉండగా.. ఆక్లాండ్ 3, మ్యూనిచ్ 4, వాంకోవర్ 5 స్థానాల్లో నిలిచాయి. మన దేశ రాజధాని ఢిల్లీ 161 స్థానంలో నిలువగా హైదరాబాద్ 144వ స్థానాన్ని దక్కించుకుంది. క్రైమ్ రేటు, వాయుకాలుష్యం, విద్యా పరంగా అంతర్జాతీయ సంస్థలు, ఉపాది అవకాశాలు మరియు వాణిజ్యం వంటి అంశాల అధారంగా ఈ సర్వే నిర్వహించారు.

(Visited 270 times, 1 visits today)