Home / Political / హైదరాబాద్ లో ఇదే చంద్రబాబు చివరి సమావేశమా ?

హైదరాబాద్ లో ఇదే చంద్రబాబు చివరి సమావేశమా ?

Author:

హైదరాబాద్ లో ఇదే చంద్రబాబు చివరి సమావేశమా? నన్ను ఒంటరిని చేసారు మంత్రులపై ఆగ్రహించిన బాబు ఏపీ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ఇవాళ జరుగుతోంది . ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో జరుగనున్న ఈ క్యాబినెట్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణ దాదాపుగా పూర్తి కావడం, మిగిలిన రైతులను భూ సమీకరణ దిశగా ఒప్పించే పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తున్నట్టు సమాచారం. అలాగే “‘రైతుకోసం చంద్రన్న యాత్ర”లపై కూడా ఈ భేటీలో చర్చ సాగింది. శ్రీకాకుకుళం జిల్లా నూన అనే గ్రామం నుంచీ ఈ యాత్రమొదలౌతుందని చంద్రబాబు స్పష్టం చేసారు.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ బయట క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం.మళ్లీ ఈ రోజు సచివాలయంలో మంత్రిమండలి భేటీ నిర్వహిస్తోంది. . 5 రోజులు శాసన సభ సమావేశాలు పూర్తి అయిన నేపథ్యంలో సభ జరిగిన తీరు తెన్నులపై క్యాబినేట్ చర్చించింది. అలాగే ఈనెల 9 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రైతుకోసం చంద్రన్న యాత్రల నిర్వహణ పై కాబినేట్లో చర్చ నడుస్తున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి భూసేకరణ, విజయవాడ-విశాఖ మెట్రో రైలు నిర్మాణాన్ని వేగవంతం చేయడం అమరావతికి వివిధ శాఖల కార్యాయాల తరలింపు, మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి భూసేకరణ వంటి అంశాలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. విజయవడ, విశాఖ పట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో పూర్తిస్తాయి ఈ-గవర్నెస్ ఏఅర్పాట్లపై కూడా సమీక్ష జరిగింది. వ్యవసాయ అవసరాలకోసం రోజుకి 7 గంటల విద్యుత్ సరఫరా మీద కీలక నిర్ణయం తీసుకునే దిశగా చర్చ సాగింది.

ఇక అసలు విషయం ఏమిటంటే తెలంగాణా లో ఇదే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చివరి సమావేశం అవనుంది. ఇకనుంచీ తమ రాష్ట్రం లోనే సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయం   తీసుకున్నారట. ఇదే సందర్బం లో చంద్రబాబు సహచర మంత్రుల పై అసహనం ప్రదర్శించారు. వైసీపీ నేత జగన్ చేసిన ఆరోపణల విషయంలో తనని ఒంటరిగా వదిలేసారనీ., ఒక్కరంటే ఒక్కరు కూడా తనకి అనుకూలంగా మాట్లాడలేదనీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలా ఉంటే ముందు ముందు ఎలా? మనం ఐఖ్యంగా ఉండక పోతే వచ్చే కాలం లో సమస్యల్నెలా ఎదుర్కోగలం, రాజధాని నిర్మాణం లో ఎన్ని సమస్యలున్నా నేను అవన్నిటినీ సాధించాలనుకుంటే మీరు కనీస సహకారం కూడా ఇవ్వలేక పోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. దానికి స్పందించిన మంత్రులు ఇకముందు అలా జరగదనీ ప్రతిపక్షాన్ని సమర్థ వంతంగా ఎదుర్కుంటామనీ చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ ఇక్కడి నుంచి రాజధాని మార్పు విశయం లో తొందరగా నిర్ణయం అయిపోవాలనే యోచనలోనే ఉన్నట్టు తెలుస్తోంది…

(Visited 114 times, 1 visits today)