Home / General / న్యూ ఇయర్ షాక్: మందు బాబుల కోసం పక్కా స్కెచ్ రెడీ చేసిన పోలీసులు.

న్యూ ఇయర్ షాక్: మందు బాబుల కోసం పక్కా స్కెచ్ రెడీ చేసిన పోలీసులు.

Author:

2017 సంవత్సరంకి గ్రాండ్ గా టాటా చెబుతూ… 2018 గ్రాండ్ వెల్ కమ్ చెప్పే డిసెంబర్ 31వ తేదీని ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంటే.. మన హైదరాబాద్ పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు..డిసెంబర్ 31 న స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్ లని నగరమంతా ఏర్పాటు చేయనున్నట్లు డీసీపీ రంగనాథ్ ఈరోజు ఒక ప్రకటన జారీ చేసారు.

Important Announcement from HTP::

This December 31st Hyderabad Traffic Police (HTP) will be conducting special Drunken…

Posted by Hyderabad Traffic Police on Monday, 25 December 2017

డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అతిగా తాగి రోడ్డుపైకి వస్తే బాగుండదని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వాహనం నడిపితే సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ర్యాష్ డ్రైవింగ్ చేసినా.. వాహనాలను సీజ్ చేస్తామన్నారు. రాత్రి 10 గంటలకే రోడ్డుపైకి 100 టీమ్స్ తనిఖీలు ప్రారంభిస్తాయని చెప్పారు. తెల్లవార్లూ తనిఖీ చేస్తామని ప్రకటించారు ట్రాఫిక్ పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తాన్ని కెమెరాలో షూట్ చేయబోతున్నాం అని దానితో పాటు పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేయడంతో పాటు డేటా మొత్తాన్ని ఆధార్ తో లింక్ చేస్తున్నాం అని.. భవిష్యత్ తో ఇబ్బంది పడతారని కూడా చెబుతున్నారు పోలీసులు. సో.. తాగినా.. తాగి ఊగినా అంతా లోపలే.. బయటకు మాత్రం రావొద్దు. వచ్చినా బండ్లు తీయొద్దు.

(Visited 200 times, 1 visits today)