Home / Entertainment / హైపర్ సినిమా రివ్యూ & రేటింగ్.

హైపర్ సినిమా రివ్యూ & రేటింగ్.

hyper-perfect-review-and-rating

Alajadi Rating

3/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: రామ్ - రాశి ఖన్నా- సత్యరాజ్ - రావు రమేష్ - మురళీ శర్మ - ప్రభాస్ శీను - తులసి తదితరులు

Directed by: సంతోష్ శ్రీనివాస్

Produced by: అనిల్ సుంకర - రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట

Banner: 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్.

Music Composed by: జిబ్రాన్

కథ :

మధ్య తరగతి కుటుంబానికి చెందిన నారాయణ మూర్తి(సత్య రాజ్) ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుంటాడు, తండ్రిని(సత్య రాజ్) పిచ్చిగా ప్రేమించే కుర్రాడిగా సూర్య(రామ్) పెరుగుతాడు, తండ్రి కోసం ఏమైనా, ఎవరినైనా ఎదురించే మనస్తత్వంతో ఉంటాడు, తండ్రికి నచ్చిన అమ్మాయి(రాశి ఖన్నా) కోసం వెతుకుంటాడు, ఈ సమయంలో ఒక మంత్రి వల్ల తన తండ్రికి సమస్య వస్తుంది, ఆ సమస్య ఏంటి..? మంత్రిని ఎలా ఎదుర్కొన్నాడు..? సమస్యని ఎలా పరిష్కరించాడు..? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ :

తండ్రిని పిచ్చిగా ప్రేమించే కొడుకు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, తండ్రికి సహాయం చేసాడని కొడుకు గజ అనే రౌడీకి సహాయం చేయడంలో కామెడీ సన్నివేశాలు, హీరో, హీరోయిన్ ల మధ్య లవ్ ట్రాక్ అన్నింటిని కలిపి ఫస్టాఫ్ ని చాలా అద్భుతంగా తీశారు, ఎక్కడ కూడా బోరింగ్ సన్నివేశాలు లేకుండా, ఇరికించిన కామెడీ ట్రాక్ లు కూడా లేకుండా తెరకెక్కించారు.

ఒక సూపర్ ఇంటర్వెల్ ఫైట్ తరువాత సెకండ్ ఆఫ్ లో సినిమా అసలు కథలోకి ఎంటర్ అవుతుంది,తన తండ్రికి వార్నింగ్ ఇచ్చిన మినిష్టర్ రామప్ప (రావు రమేష్) కి రామ్ కి మధ్యలో సెకండ్ ఆఫ్ నడుస్తుంది, కథ రోటినే అయిన సత్య రాజ్ క్యారెక్టర్, ఇంకొన్ని సన్నివేశాలతో, హీరో చెప్పే డైలాగ్స్ తో మరియు ఒక సోషల్ మెసేజ్ తో సినిమాని మంచిగా ప్రెజెంట్ చేసారు. కాకపోతే చివరికి వచ్చే సరికి సినిమా రొటీన్ తెలుగు సినిమా ఫార్ములాలోకి వెళ్ళిపోతుంది.

నటీనటుల పనితీరు:

రామ్: రామ్ లో ఉండే ఎనర్జీ మొత్తం సినిమాలో కనిపిస్తది, హైపర్ అనే టైటిల్ కి తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ జోడించి హైపర్ ఎనర్జిటిక్ గా నటించాడు, ఎప్పటిలాగే డాన్స్ లు కూడా కుమ్మేసాడు, కొన్ని ఎమోషనల్ సీన్లలో, డైలాగ్స్ డెలివరీలో కూడా చాలా బాగా చేసాడు.

రాశి ఖన్నా: ఈ సినిమాలో రాశి ఖన్నా పాత్రా చాలా చిన్నది, ఉన్నంత సేపు ప్రేక్షకులని తన అందంతో కట్టిపడేసింది.

సత్య రాజ్: సత్య రాజ్ ఎంత గొప్ప నటుడో చెప్పాల్సిన అవసరం లేదు, మాములు మధ్యతరగతి ఉద్యోగి పాత్రలో అద్భుతంగా నటించాడు, ప్రభుత్వ ఉద్యోగుల గురుంచి సత్యరాజ్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

రావు రమేష్: రావు రమేష్ కి ఏ పాత్ర ఇచ్చిన సంపూర్ణ న్యాయం చేస్తాడని మరోసారి రుజువు చేసాడు.

రౌడీగా చేసిన మురళి శర్మ, షియాజీ షిండే తదితరులు అందరు తమ పాత్రలకి న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ముందుగా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ గురుంచి మాట్లాడుకోవాలి, కొంచెం రొటీన్ కథే అయిన దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి, మంచి స్క్రీన్ ప్లే తో  మన ముందుకు తీసుకువచ్చాడు, ఈ సినిమా ద్వారా అటు రాజకీయ నాయకులకి, ప్రజలకి మంచి మెసేజ్ ని ఇచ్చాడు కాకపోతే హీరోయిన్ ని కేవలం పాటల కోసమే తీసుకున్నట్లుగా ఉంది, ఇక డైలాగ్స్ రాసిన అబ్బూరి రవిని ఖచ్చితంగా అభినందించాల్సిందే తండ్రి గురుంచి, ప్రభుత్వ ఉద్యోగుల గురుంచి అద్భుతమైన డైలాగ్స్ రాసాడు.జిబ్రాన్ అందించిన పాటలన్ని బాగున్నాయి, మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని బాగా ఎలివేట్ చేసింది.

ప్లస్ పాయింట్స్:

  • రామ్ ఎనర్జీ
  • రావు రమేష్
  • డైలాగ్స్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • ఎడిటింగ్
  • క్లైమాక్స్
  • కొన్ని రొటీన్ సన్నివేశాలు.

అలజడి రేటింగ్: 3/5

పంచ్ లైన్: “రామ్ = హైపర్ + ఎనర్జీ “

(Visited 3,392 times, 1 visits today)