Home / Political / క్షమించమని అడుగుతున్న ఐఏఎస్ ఆఫీసర్

క్షమించమని అడుగుతున్న ఐఏఎస్ ఆఫీసర్

Author:

jagdish sonkar facebook

ఓ ఐఏఎస్ ఆఫీసర్ తన facebook స్టేటస్ లో ఏమని పోస్ట్ చేసారో తెలుసా ?

ఇటీవల అతను చేసిన ఓ పనికి చాలా సిగ్గుపడుతున్నా అని, తనని ఆ పని వెంటాడుతూనే ఉందనీ… అందరూ తనను క్షమించాలని కోరుతూ ఫేస్ బుక్ లో తన వాల్ మీద స్టేటస్ పెట్టేసారు . ఇంతకీ అతనేం చేసాడో తెలుసుకోవాలని ఉందా ? మరి ఇంకెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్దామా ?

ఛత్తీస్ ఘడ్ కి చెందిన జగదీష్ సోంకర్ మొదట్లో డాక్టర్ వృత్తిలో ఉండేవారు . డాక్టర్ గా పనిచేస్తూనే ఎంతో కష్టపడి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఐఏఎస్ కూడా పాస్ అయ్యారు. కాగా పోయినవారం ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఓ ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీకి వెళ్లారు. అక్కడ ఒక రోగితో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆ పేషంట్ బెడ్ పైన కాలు వేశారు. ఆ దృశ్యాన్ని టక్కున ఎవరో క్లిక్ మనిపిచ్చారు, మరి ఇక ఇలాంటి ఫోటోలు బయటకి వస్తే నెటిజన్లు ఊరుకుంటారా చెప్పండి . సామాజిక మాధ్యమాలలోనూ, పత్రికల్లోనూ ప్రచురితమైంది. నెటిజన్లు ఆ అధికారిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రెచ్చిపోయారు, పాపం ఇక ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది,పరువు కూడా పోయింది.

మరి ఆ అధికారికి ఇప్పటికైనా తప్పు ఒప్పుకోకపొతే బాగుండదు అనిపించిందేమో ,తన తప్పు తెలుసుకున్న సోంకర్ క్షమించమంటూ పోస్టు చేశారు. తప్పు జరిగాక అందరూ చెప్పినట్లుగానే తాను అలా కావాలని చేయలేదని, అనుకోకుండా జరిగిందని తెలిపారు. ఈ చర్య ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కూడా కోరారు. తను అనుకోకుండా పొరపాటున చేసిన ఈ పని వలన సివిల్ సర్వెంట్ల ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని తెలుసని, అందుకే ప్రతి ఒక్కరికి పేరుపేరునా క్షమాపణలు తెలియజేస్తున్నానని తన పోస్టులో పేర్కొన్నారు. ఏమైనా ఫోటో క్లిక్ మనిపించి ఎవరో మంచి పనే చేసారు, ఇకపై ఆ ఆఫీసర్ వళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తాడు కదూ…!

(Visited 2,018 times, 1 visits today)