Home / health / ఒక్క రాత్రి నిద్ర పోకపోతే మరణానికి ఎంత దగ్గరగా ఉన్నట్టో తెలుసా? ఇది చదవండి

ఒక్క రాత్రి నిద్ర పోకపోతే మరణానికి ఎంత దగ్గరగా ఉన్నట్టో తెలుసా? ఇది చదవండి

Author:

నిద్ర పోవటం మనిషి జీవితం లో అత్యంత ముఖ్యమైనదీ, ఎక్కువగా మనం పట్టించుకోనిదీ మెదడుకు విశ్రాంతి ఇవ్వాల్సిన నిద్రనే. మామూలుగా మన జన్యు నిర్మానం ప్రకారం చీకటిగా ఉన్న సమయాన్ని మెదడు విశ్రాంతి సమయంగా తీసుకుంటుంది. కానీ ఇప్పటి స్పీడ్ యుగంలో రకరకాల కారణాల వల్ల సరిపోయినంత నిద్రలేకపోవటం మన ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, రాబోయే తరం లో అంటే ఇప్పుడు స్కూల్ వయసులో ఉన్న పిల్లలు యుక్త వయసుకు వచ్చేసరికి నిద్ర సమస్యలు, యుక్తవయసులోనే గుండె జబ్బులు, డిప్రెషన్‌ వంటి రుగ్మతల పాలయ్యే అవ కాశాలు ఎక్కువగా ఉంటాయట. అసలు ఒక్క రోజు నిద్రపోకుండా ఉంటే మెదడుకు ఒక పుల్లగుచ్చుకున దానికి సమానం. ఆ లెక్కన మనం నిద్రని నిర్లక్షం చేసి ఎంత రిస్క్ తీసుకుంటున్నామో కదా…!

సహజంగా నిద్రించాల్సిన సమయంలో మేల్కొని ఉంటే మెదడులో రసాయనాల సమతౌల్యం దెబ్బతింటుది. శరీరం వేడెక్కుతుంది. ఇది జీవ క్రియల అలసత్వానికి కారణమవుతుంది. వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. మనలోని హార్మోన్ల, ఎంజైముల ఉత్పత్తికి తమదైన ఒక కాలమాన ప్రణాళిక ఉంటుంది. సహజంగా గ్లూకోజ్‌ ఎక్కువగా అవసరమయ్యే ఉదయం వేళల్లో కార్టిజాల్‌ హార్మోన్‌ పెద్ద మొత్తంలో ఉత్పన్నమవుతుంది. శ్రమ తగ్గిపోయే సాయంత్రానికి ఆ ఉత్పత్తి త గ్గిపోతుంది. అయితే ఈ బయోలాజికల్‌ క్లాక్‌ను తారుమారు చేసినప్పుడు ఈ హార్మోన్‌ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది.

20180203_160057

జీవ గడియార వ్యవస్థ (Biological clock) అనేది మనిషి మనిషికీ వేరు వేరుగా ఉండదు. వ్యక్తుల శారీరక వ్యత్యాసాల వల్ల ఏదైనా తేడా ఉన్నా అది స్వల్పమే. అందుకే ఎవరికి వారు నిద్రా, మెలకువల సమయాన్ని తమ ఇష్టానుసారంగా మార్చుకోవడం కుదరదు. రాత్రంతా మేలుకునే వాళ్లు కొందరు ‘‘ ఈ టైమింగ్స్‌ వల్ల మాకు అసౌకర్యంగా గానీ, అస్వస్థతగా గానీ ఏమీ ఉండడం లేదు. పైగా ఉత్సాహంగా, హుషారుగానే ఉంటున్నాం. ఇక ఇబ్బంది ఏముంది?’’ అంటూ ఉంటారు. అయితే, పైకి అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపించినా, లోలోపల జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది.

మౌలికంగా సూర్యగమనానికీ, ఆకలికీ అవినాభావ సంబంధం ఉంది. ఉదయాస్తమయాల మధ్య సరిగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఆలోచనలకూ, కార్యాచరణకూ మూలాధారంగా మనలో ఒక ప్రాణశక్తి ఉంటుంది. అది జీవితాంతం మన తోడై ఉంటుంది. అయితే రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొనే వాళ్లల్లో ఈ ప్రాణశక్తి అత్యధికంగా ఖర్చు అవుతుంది. దీనివల్ల యుక్త వయసులోనే శరీరం రోగగ్రస్తం కావడం, అకాల వృద్ధాప్యం రావడం సంభవిస్తాయి. రాత్రివేళల్లో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములు కూడా స్వల్పంగానే ఉత్పన్నమవుతాయి. ఈ కారణంగా మధ్యరాత్రి చేసే భోజనం సరిగ్గా జీర్ణం కాదు. శరీరమంతా నిద్రావస్థలో ఉండడం కూడా ఇందుకు కారణమే. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణాశయ సమస్యలే కాదు స్థూలకాయం రావడానికి కూడా ఈ కారణాలే ప్రధానంగా ఉంటాయి. అందుకే…..,నా శరీరం, నా ఇష్టం అనే ధోరణితో కాకుండా, ప్రకృతి సహజ నియమాలను ఎవరైనా విధిగా పాటించడమే శ్రేయస్కరం.

(Visited 178 times, 1 visits today)