Home / Inspiring Stories / యజమాని కుటుంబాన్ని కాపాడటం కోసం ప్రాణత్యాగం చేసిన కుక్క..!

యజమాని కుటుంబాన్ని కాపాడటం కోసం ప్రాణత్యాగం చేసిన కుక్క..!

Author:

పూర్వ కాలం నుండి కుక్క, మనుషులతో అంత్యంత నమ్మకంగా ఉండే జంతువు,ఒక వెయ్యి రూపాయల కోసం అయిన ఒకరిని ఒకరు మోసం చేసుకునే మనుషులు ఉన్న ఈ రోజులలో కొంచెం ముద్ద పడేస్తే చాలు తమ విశ్వాసాన్ని కోల్పోవడంలేదనే నిజాన్ని ఓ కుక్క రుజువు చేసింది.

ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్‌లోని రాయ్‌ఘడ్ అటవి ప్రాంతంలో దిబాకర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు.

Dog-Fight-with-4-snakes

అటవీ ప్రాంతం కాబట్టి తమకి తోడుగా ఒక కుక్కని పెంచుకుంటున్నారు, రాత్రి సమయాల్లో రక్షణగా ఉంటుందని దానిని రోజూ బయటే ఉంచేవాడు, నిన్న రాత్రి ఆ కుక్క చాలా పెద్ద సాహసం చేసి తనకి అన్నం పెట్టిన యజమానిని కాపాడింది, నిన్న రాత్రి ఒక్కసారిగా నాలుగు విష పాములు ఇంటి లోపలికి రావడం చూసిన కుక్క వాటితో పోరాడింది, మనిషి కూడా చేయలేని సాహసాన్ని ఓ కుక్క చేసింది, ఒక పెద్ద ప్రమాదం నుండి తన యజమాని కుటుంబాన్ని కాపాడింది, నాలుగు పాములను ఇంటిలోకి రానివ్వకుండా అవి తీవ్రంగా కాటేస్తున్న వాటిని చీల్చిచెండాడి చంపేసింది, కొద్దీ సమయం తరువాత ఆ పాముల విషం వల్ల కుక్క కూడా ప్రాణాలు విడిచింది, పొద్దున లేచి మృతిచెందిన కుక్కను ఆ పక్కనే ఉన్న చనిపోయిన పాములను చూసి యజమాని ఆశ్చర్యానికి లోనయ్యాడు, పాముల బారి నుండి తన కుటుంబంలోని 8 మందిని కుక్క కాపాడడానికి కుక్క ప్రాణాలనే త్యాగం చేసిందని చాలా భాదపడ్డాడు, ఆ కుక్క చూపిన విశ్వాసానికి ఆ కుటుంబంతో పాటు ఆ ఊరి ప్రజలు కూడా కంటతడి పెట్టారు, సాటి మనిషి కూడా చూపలేని తెగువ ఒక కుక్క చూపించి కుక్కలకి ఉండే విశ్వాసాన్ని మరోసారి రుజువు చేసింది.

Must Read: అమాయక అమ్మాయి ప్రాణం తీసిన ఫేస్ బుక్ పోస్ట్.

(Visited 27,986 times, 1 visits today)