Home / Latest Alajadi / భారతదేశం ఇటీవలి కాలంలో పేదరికంపై భారీ విజయాన్నే సాధించింది: ఐరాస

భారతదేశం ఇటీవలి కాలంలో పేదరికంపై భారీ విజయాన్నే సాధించింది: ఐరాస

Author:

ఇండియాలో పేదరికం తగ్గుతోంది.ప్రజలు అభివృద్ధి బాటపడుతున్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి.  2005-06 నుంచి 2015-16 దశాబ్దకాలంలో 27.1 కోట్లమంది ప్రజలు పేదరికం కోరల నుంచి బైటపడ్డారు. దీనివల్ల దేశంలో పేదరికం శాతం సగానికి.. అంటే 55 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది. ఐక్యరాజ్యసమితి విద్య, వైద్యం వంటి పలు అంశాల ఆధారంగా రూపొందించిన యునైటెడ్ నేషన్ ఇండెక్స్ (UNI)  ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇది మామూలు విషయమేం కాదు. అఖిలభారత స్థాయిలో ..రాష్ర్టాల మధ్య మాత్రం అంతరం ఉంది.సిక్కిం ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. బిహార్ లాస్ట్ ప్లేస్ లో ఉంది. అప్పటికి కొత్త రాష్ట్రం కావడంతో తెలంగాణ గురించి సపరేట్ గా ఇవ్వలేదు. ఏపీలో 2.6 కోట్ల మంది పేదరికం నుంచి బైటపడ్డారని తెలిపింది రిపోర్ట్. కేరళ పరిస్థితి చాలావరకు మెరుగుపడితే.. బిహార్ మాత్రం పైకిలేవడానికి తంటాలు పడుతోంది. ఆర్థిక స్థితిగతుల్ని, వ్యక్తిగత స్థాయిలో మనుషులు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని .. అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఐరాస బహుముఖ పేదరిక సూచిక ( MPI) రూపొందిస్తోంది.

Human Development Report

మానవ అభివృద్ధి నివేదిక (HDI) తరహాలోనే విద్య, వైద్యం జీవన ప్రమాణాలను లెక్కలోకి తీసుకుంటారు. ఎన్నిరకాలుగా పేదరికం వల్ల బాధలు పడుతోందన్నది అంచనా వేసి, ఈ విశిష్టమైన సూచికను రూపొందిస్తారు.

(Visited 1 times, 1 visits today)