Home / Inspiring Stories / ఇకనుండి అడ్డగోలుగా వాహనాలు నడిపితే తాట తీస్తారు.

ఇకనుండి అడ్డగోలుగా వాహనాలు నడిపితే తాట తీస్తారు.

Author:

రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. మనం సరిగ్గానే వెళ్తున్నా తప్పతాగి, లైసెన్స్ లేకుండా అడ్డగోలుగా బండ్లు నడుపుతున్న వారు రోజు ఎదో ఒకచోట ప్రమాదాలకు కారణం అవుతున్నారు. కఠినమైన శిక్షలు లేకపోవడంతో నామమాత్రపు జరిమానాలు కట్టి కేసుల నుండి బయటపడుతున్నారు నిందితులు. ఆటువంటి వారిని కఠినంగా శిక్షించడం కొరకు పాత చట్టాలను మార్చూతూ మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఈ సవరణల ప్రకారం గతంలో నామమాత్రంగా ఉన్న జరిమానాలు ఇప్పుడు భారీగా పెరగనున్నాయి అంతే కాకుండా మైనర్లు లైసెన్స్ లేకుండా వాహనం నడిపి మరొకరి మృతికి కారణం అయితే ఆ మైనర్ తల్లితండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష విధించనున్నారు. పెరిగిన జరిమానాల రుసుములు క్రింద చూడండి.

new traffic challans

  • హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే జరిమానా: 1000 రూపాయలు+ మూడు నెలల పాటు లైసెన్స్‌ రద్దు (గతంలో 100 రూపాయలు)
  • లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానా: 5000 రూపాయలు (గతంలో 500 రూపాయలు)
  • మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా: 10000 రూపాయలు+ జైలు శిక్ష (గతంలో 2000 రూపాయలు).
  • ఇన్సూరెన్స్ లేకపోతే జరిమానా: 2000 రూపాయలు (గతంలో 1000 రూపాయలు)
  • సీటు బెల్టు లేకుండా ప్రయాణిస్తే జరిమానా: 1000 రూపాయలు (గతంలో 100 రూపాయలు)
  • పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంతే జరిమానా: 1000 రూపాయలు ప్రతి ప్రయాణికుడికి

ఇవే కాకుండా వాహనం కండీషన్ లో లేకపోయిన, రోడ్డు నియమాలు పాటించకపోయిన భారి జరిమానాలు విధించనున్నారు అందుకే ఈ సారి రొడ్డు మీదకు వచ్చెముందు జాగ్రత్త వహించండి.

(Visited 599 times, 1 visits today)