టీమిండియా మరోసారి గ్రాండ్ విక్టరీ.వెస్టిండీస్ పై ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో విండీస్ పై గెలుపొందింది. కోహ్లీసేన స్వదేశంలో ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఇన్నింగ్స్ తేడాతోనే విజయాలు సాధించడం గమనార్హం. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు ఈ విజయం కాస్త ఊరట కలిగించేదే. ప్రపంచ నంబర్ వన్ భారత్‌కు విండీస్ వీసమెత్తు పోటీనీ ఇవ్వలేకపోయింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది.
ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ స్టార్ట్ చేసిన భారత జట్టు.తొలి ఇన్నింగ్స్‌లో పృథ్వీషా (134), పుజారా (86), కోహ్లీ (139), రిషబ్ పంత్ (92), రవీంద్ర జడేజా (100 నాటౌట్) పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. దాంతో కోహ్లీ 649/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ 181 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్ ఆడింది.
స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్ (5/57), రవీంద్ర జడేజా (3/35) చెలరేగడంతో ఫాలోఆన్‌లో 196 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ (83; 93 బంతుల్లో 8×4, 4×6) ఫర్వాలేదనిపించాడు. యువ పృథ్వీషా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.