Home / Inspiring Stories / షాకింగ్ న్యూస్: 1000, 500 నోట్లు రద్దు, రేపు బ్యాంకు లావాదేవీలు బంద్.

షాకింగ్ న్యూస్: 1000, 500 నోట్లు రద్దు, రేపు బ్యాంకు లావాదేవీలు బంద్.

Author:

నల్ల ధనాన్ని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోడి సంచలన నిర్ణయం తీసుకున్నారు, ఎన్నో రోజులుగా ప్రజలు ఎదురుచూస్తున్న సంస్కరణలు రేపటినుండే అమలు చేయాలనే సంచలన నిర్ణయం తీసుకున్నరు. ఈ రోజు ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఇప్పటివరకు చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

new-currency

మోడి సందేశంలోని నిర్ణయాలు:

  • ప్రస్తుతం చలామణిలో ఉన్న 500, 1000 నోట్లు రద్దు అవుతాయి.
  • ఇప్పటివరకు చలామణిలో 500, 1000నోట్లు నవంబర్ 11 నుంచి డిసెంబర్ 31 వరకు పోస్ట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో మార్చుకోవచ్చు
  • ఎల్లుండి (నవంబర్ 10) నుండి అమలులోకి రానున్న కొత్త 500, 2000 రూపాయల నోట్లు.
    నవంబర్ 11 వరకు గవర్నమెంట్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్, పోస్ట్ ఆఫీస్, పెట్రోల్ బంక్లలో పాత రూ. 500, రూ. 1000 నోట్లు చలామణి అవుతాయి.
  • బ్యాంకుల్లో నగదు మార్చుకోవాలంటే ఐడి కార్డు తప్పనిసరి.
  • ఎల్లుండి నుండి ఒక రోజుకు గరిష్టంగా 10వేలు, వారానికి 20వేల రూపాయలు మాత్రమే ATM నుండి డబ్బులు తీసుకోవచ్చు.
  • కార్డుల ద్వారా జరిగే లావాదేవీల పై ఎటువంటి ఆంక్షలు లేవు.
  • రేపు బ్యాంక్ లు మరియు రేపు, ఎల్లుండి  ATM లు పనిచేయవు.
  • డిసెంబర్ 31 వరకు పాత 500, 1000 రూపాయల నోట్లని పోస్ట్ ఆఫీస్ లలో మార్చుకోవాలి.
(Visited 5,478 times, 1 visits today)