Home / Inspiring Stories / ఫేస్‌బుక్ లో తప్పు కనిపెట్టాడు, 10 లక్షలు సంపాదించాడు!

ఫేస్‌బుక్ లో తప్పు కనిపెట్టాడు, 10 లక్షలు సంపాదించాడు!

Author:

ప్రొద్దున లేస్తునే చాలామంది ఫొన్ ఒపెన్ చేసి చెక్ చేసుకునేది ఫేస్‌బుక్ అప్డేట్స్ నే. ఇంతలా ఫేస్‌బుక్ చాల మంది జీవితాలలో భాగమైపోయింది, తిన్నా, పడుకున్నా, లేచినా, చివరికి గాలి పీల్చుకుంటున్నా కూడా తమ ఫేస్‌బుక్ లో రాసే వాళ్ళున్నారు. ఇలా టైం పాసుకు కాకుండా ఫేస్‌బుక్ తో అరుణ్ కుమార్ అనే యువకుడు 10 లక్షలు సంపాదించాడు. ఎలాగో మీరే చదవండి.

youth-rewarded-for-finding-chinks-in-facebook-armour

కేరళలోని కోల్లాం కి చెందిన 20 యేళ్ళ అరుణ్, ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మొదట నుండి కంప్యూటర్ కోడింగ్ పై మక్కువ ఉన్న అరుణ్ హ్యకింగ్ నేర్చుకున్నాడు.  కోడింగ్ పై మంచి పట్టు సాధించిన అరుణ్ వివిద సంస్థల అప్లికేషన్ల కోడ్ పరిశీలించి ఎవైనా తప్పులు ఉంటే ఆ సంస్థ నిపుణులకు సమాచారం అందించేవాడు. ఆ విధంగా ఫేస్‌బుక్ కోడ్ లో కూడా ఒక ప్రమాదకరమైన తప్పును కనుగొన్న అరుణ్ ఆ విషయాన్ని ఫేస్‌బుక్ వారికి తెలియజేసాడు. ఆ తప్పును ధ్రువికరించి, సరిదిద్దిన ఫేస్‌బుక్ వారు అరుణ్ కి కృతజ్ఞతగా 10 లక్షల బహుమతి ప్రకటించారు. ఇలా తప్పులు కనిపెట్టి అరుణ్ ఇప్పటివరకు 40 లక్షల రూపాయల పైచిలుకు సంపాదించాడట. ఇలా ఫేస్‌బుక్ ద్వారా డబ్బు సంపాదించిన అరుణ్ ని అభినందించుదాం.

(Visited 7,633 times, 1 visits today)