ఇండోనేసియాలోని పాలూ నగరంలో భూకంపం కారణంగా సంభవించిన సునామీ అత్యంత విషాదాన్ని నింపింది. సునామీ ధాటికి మృతి చెందిన వారి సంఖ్య ఆదివారానికి 800కు చేరుకుంది. ఈ ఘటనలో 1000మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సులవేసి దీవిలోని పాలూ సిటీలో స్థానికులు బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లు చేస్తోన్న సమయంలో ఒక్కసారిగా సునామీ ముంచెత్తింది. 20 అడుగుల ఎత్తులో అలలు విరుచుకుపడ్డాయి. దీంతో ఎత్తైన భవనాలు నేలకూలిపోయాయి.
సునామీ బీభత్సంతో వందలాది మంది గల్లంతయ్యారు. కొన్నిచోట్ల మృతదేహాలు నగర వీధుల్లో తేలియాడాయి. హాస్పిటల్స్ అన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. కొన్ని ఆసుపత్రులు కూడా కూలిపోవడంతో బయట టెంట్లు వేసి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.17 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
సునామీ బీభత్సంతో పెద్దసంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. కొంతమందికి ఆరుబయటే చికిత్స చేయాల్సి వస్తోంది. కొన్ని ఆసుపత్రులు కూడా కూలిపోవడంతో బయట టెంట్లు వేసి వైద్య సహాయం అందిస్తున్నారు. ఇళ్లలోకి వెళ్లడానికి భయపడుతూ చాలా మంది బయటే తలదాచుకుంటున్నారు.