Home / Inspiring Stories / ఒక్క అప్లికేషన్ తో 37 బ్యాంకులలో ఎడ్యుకేషనల్ లోన్ అప్లై చేయవచ్చు.

ఒక్క అప్లికేషన్ తో 37 బ్యాంకులలో ఎడ్యుకేషనల్ లోన్ అప్లై చేయవచ్చు.

Author:

education loan

ప్రభుత్వం ప్రజల కోసం చాల పథకాలు ప్రవేశపెడుతుంది కాని వాటి గురించి సామాన్య ప్రజలకు తెలిసే సరికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటి మంచి పథకమే “విద్యాలక్ష్మి పొర్టల్”. ఉన్నత విద్యనభ్యసించడానికి డబ్బులేని వారికి బ్యాంక్ లోన్లు ఇప్పించడమే ఈ పొర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆగస్ట్ 15, 2015 న ఐదు బ్యాంకుల సహకారంతో మొదలైన ఈ పొర్టల్ తో ఇప్పుడు 37 బ్యాంకులలోను లోన్లు అప్లై చేయవచ్చు, అది కూడా ఇంట్లొ కూర్చొని ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

ఈ పొర్టల్ ద్వార మన దేశంతో పాటు, విదేశాలలో ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న విద్యార్దులకి ఆ ఉన్నత విద్య, అర్హతని బట్టి లోన్లు ఇస్తారు. ఈ పొర్టల్ లో ఇంకొ మంచి విషయం ఎంటి అంటే ఒకే ఒక్క అప్లికేషన్ తో, ఇంట్లోనె కూర్చోని 37 బ్యాంకులలొ లోన్ కి అప్లై చేయవచ్చు మరియు వివిద బ్యాంకులు అందిస్తున్న లోన్ పథకాలను చదివి తెలుసుకొవచ్చు. మనదేశంలో 4 లక్షల వరకు ఎడ్యుకేషనల్ లోన్ కి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా బ్యాంకులు లోన్లు ఇస్తాయని మనలో చాలమందికి తెలియదు. “విద్యాలక్ష్మి పొర్టల్” లొ ఇలాంటి విషయాలు మరెన్నొ ఉంటాయి. ఈ పొర్టల్ ద్వార అప్లై చెసిన లోన్ స్టేటస్ ఎప్పటికప్పుడు మనం ఆన్ లైన్లొ చెక్ చేసుకొవచ్చు. మరెందుకు ఆలస్యం వెంటనే https://www.vidyalakshmi.co.in ఒపెన్ చేసి రిజిస్టర్ అవ్వండి.

(Visited 1,045 times, 1 visits today)