Home / Inspiring Stories / జీవితం గురుంచి ఆపిల్ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ చెప్పిన అద్భుతమైన నిజం..! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!!

జీవితం గురుంచి ఆపిల్ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ చెప్పిన అద్భుతమైన నిజం..! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!!

Author:

ఆపిల్ కంపెనీ సృష్టికర్త , ప్రపంచ మేధావుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్  ఆసుపత్రిలో , తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు,

steve-jobs-apple-co-founder

వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను.
పని తప్ప నాకు వేరే ఆనందం తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను.
ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను
ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే , ఇన్నాళ్ళూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకూ కొరగానివని నాకు అనిపిస్తోంది .
ఈ నిశిరాత్రిలో …….. నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది.
నాకిప్పుడనిపిస్తోంది……….. జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక ,
మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి.
కళలూ , అనుబంధాలూ , చిన్నపాటి కలలూ , కోరికలూ , సేవ ……….
ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది .
కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది .
అందుకు నేనే ఉదాహరణ .
ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం.
నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు .
నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు .
నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులూ,
అందమైన జ్ఞాపకాలు మాత్రమే .
ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి.
మనల్ని ఉన్నతస్థాయికి చేరుస్తాయి .
నిజం , అంతా మన హృదయంలోనే , మన చేతుల్లోనే ఉంది .
ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా?……..
నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం.
నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ను నియమించుకోగలవు .
నీ కోసం సంపాదించిపెట్టగలిగే ఉద్యోగులను నియమించుకోగలవు.
కానీ , నీ జబ్బునూ , నీ బాధనూ అనుభవించే వ్యక్తిని మాత్రం
ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు .
నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చుగానీ
చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు .
జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా –
కథ ముగిసే రోజు , తెరపడే రోజు ఒకటి వస్తుంది .
అప్పుడు – ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు .
అందుకే ……….., కాస్త ముందే కళ్ళు తెరువు .
డబ్బును కాదు , నీ కుటుంబాన్ని ప్రేమించు . నీ స్నేహితులను ప్రేమించు . ఆనందంగా జీవించు . అందరినీ ఆనందంగా జీవించు .

Must Read: రాజు నారాయణ స్వామి IAS…..చరిత్రలో నిలచిన ఒక ఫెయిల్యూర్ స్టోరీ.

(Visited 11,676 times, 1 visits today)