Home / Inspiring Stories / ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు.

ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు.

Author:

TS-Inter-2nd-Year-Results-2016

విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియెట్ ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటర్ విద్య మండలి ఆఫీస్ లో ఫలితాలు విడుదల చేస్తారు.

ఇంటర్మీడియెట్ పరీక్షలు గత మార్చి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగాయి. వీటికి 9,64,664 మంది (ప్రథమ సంవత్సర విద్యార్థులు-4,56,655, ద్వితీయ సంవత్సర విద్యార్థులు-5,08,009) విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలను వెబ్‌సైట్లతో పాటు కాల్ సెంటర్ ద్వారా కూడా పొందవచ్చు.

విద్యార్థులు బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌ఫోన్ నుంచి 1100 నంబరుకు, లేదా వేరే ఏదైనా ల్యాండ్‌ఫోన్, మొబైల్ నుంచి 18004251110 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ సేవా, మీ సేవ, రాజీవ్ సిటిజన్ సర్వీసు సెంటర్లు, టీఎస్/ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లోనూ ఫలితాలు పొందవచ్చు.

Click Below Websites to Know Inter Results:

(Visited 374 times, 1 visits today)