Home / Sports / ఐపీల్ వేలంలో కోట్లు కొల్లగొడుతున్న విదేశీ ఆటగాళ్లు.

ఐపీల్ వేలంలో కోట్లు కొల్లగొడుతున్న విదేశీ ఆటగాళ్లు.

Author:

ఐపీఎల్‌-10 సీజన్‌కు కోసం ఆటగాళ్ల వేలం బెంగళూరులో కొనసాగుతోంది. స్టార్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. టీ20లో స్పెషలిస్ట్‌లుగా ముద్ర పడిన ఆటగాళ్లు వేలంలో ఎవరు ఊహించని ధర పలుకుతున్నారు. ఇంగ్లండ్‌ జాతీయ జట్టు ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ను ఈ సీజన్‌లో అత్యధికంగా 14.5 కోట్లు ఖర్చు చేసి పుణె దక్కించుకుంది. మన దేశీయ ఆటగాడు, గత సంవత్సరం వేలంలో 8.5 కోట్లకి అమ్ముడు పోయిన పవన్ నేగి ఈ సంవత్సరం కేవలం ఒక కోటి రూపాయలకే అమ్ముడవటం ఆశ్చర్యం కలిగించింది.

IPL top buys

మొదటి రౌండ్ ప్రకారం వేలంలో ఎక్కువ రేటు పలికిన ఆటగాళ్ళు.

  • కోరే ఆండర్సన్‌(SA)- రూ.1 కోటి(ఢిల్లీ డేర్ డెవిల్స్)
  • మాథ్యూస్‌ను(SRI) రూ. 2 కోట్లు( ఢిల్లీ డేర్ డెవిల్స్)
  • పవన్‌ నేగి(IND) – రూ.1 కోటి(బెంగళూరు రాయల్ చాలెంజర్స్)
  • ఇయాన్‌ మోర్గాన్‌(ENG)- రూ.2 కోట్లు(కింగ్స్ లెవన్ పంజాబ్‌)
  • కసిగో రబాడ(SA)- రూ.5 కోట్లు(ఢిల్లీ డేర్ డెవిల్స్)
  • ట్రెంట్‌ బౌల్ట్‌(NZ)- రూ.5 కోట్లు(కోల్‌కతా నైట్ రైడర్స్)
  • నికోలాస్‌ పూరన్‌(WI)- రూ.30లక్షలు( ముంబయి ఇండియన్స్)
  • తైమల్‌ మిల్స్‌(ENG)- రూ.12కోట్లు (బెంగళూరు రాయల్ చాలెంజర్స్)

మొదటి రౌండ్‌లో న్యూజీలాండ్ ఆటగాడు మార్టిన్‌ గుప్తిల్‌, ఇంగ్లాండ్ ఆటగాళ్లు అలెక్స్‌ హేల్స్, జాసన్ రాయ్‌, ఇండియా ఆటగాళ్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, సౌరభ్‌ తివారీ, , ఇషాంత్‌శర్మలను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.

(Visited 1,089 times, 1 visits today)