Home / Uncategorized / ఆన్‌లైన్ ప్రపంచంలో అతి చెత్త password లలో మీదీ ఉందా ?

ఆన్‌లైన్ ప్రపంచంలో అతి చెత్త password లలో మీదీ ఉందా ?

Author:

password hacking

ఈ రోజుల్లో ఆన్‌లైన్ ప్రపంచం ఎంతలా విస్తరిస్తుందో అందరికీ తెలిసిన విషయమే .జీమెయిల్ నుంచి ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు వరకు అసలు ఒక్కటేమిటి అన్నీ ఆన్‌లైన్ లోనే. WiFi లేని ఆఫీసు లు, ఇల్లు మరియు ఆండ్రాయిడ్ వాడని మనుషులు ఎక్కడో కానీ కనిపించటం లేదు కదా …

ఇది ఇలా ఉండగా ఒక మనిషికి facebook , outlook మరియు Gmail అంటూ ఇలా రకరకాల అకౌంట్లు, మరి వీటన్నింటికీ సెక్యూరిటీ కోసం ఓ పాస్వర్డ్ అంటూ పెట్టుకోవాలి కదా ? ఏదో కష్టమైన పాస్వర్డ్ లు పెట్టుకుంటే మళ్ళీ దానిని గుర్తు పెట్టుకోవటం అదెక్కడి పనిరా బాబూ అనుకుంటూ అన్నింటికీ కలిపి ఒకే పాస్వర్డ్ అది కూడా చాలా సింపుల్ గా ఉండే పాస్వర్డ్ ని పెట్టేసి చేతులు దులిపేసుకుని బండి లాగించేస్తున్నారు, ఆన్‌లైన్ పరిబాషలో చెప్పాలంటే వీక్ పాస్వర్డ్ లు.
మరి ఇలా వీక్ పాస్వర్డ్ లు పెట్టుకుంటే హాకర్లు ఊరుకుంటారా చెప్పండి…
ప్రతి ఏడాది స్ట్రాంగ్‌గా లేని 20 లక్షల పాస్‌వర్డ్‌లు హ్యాకర్లు లీక్ చేసేస్తున్నారు. కనుక పాస్ వర్డ్ ఖచ్చితంగా అంకెలు, అక్షరాలు, గుర్తులు ఇలా మిళితమై పెట్టుకోవాలి. తరచూ మారుస్తూ ఉండాలి. కాగా స్ల్పాష్ డాటా అనే సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ కంపెనీ 2016లో వినియోగదారులు పెట్టుకున్న చెత్త పాస్ వర్డ్ లు ఇవే అంటూ ఓ జాబితాను విడుదల చేసింది. అందులో మొదటి 7 స్థానాలలో నిలిచినా పాస్వర్డ్ లు ఇవే….

1. 123456
2.password
3.12345678
4. qwerty
5.12345
6.123456789
7.football
8.1234 ….

మీలో ఎవరైనా ఇలాంటి పాస్వర్డ్ లే ఉంటే ఇకనైనా మార్చుకోండి, ఎకౌంట్ ని సెక్యూర్ గా ఉంచుకోవటం ఎంతైనా అవసరం కదా మరి.

(Visited 1,734 times, 1 visits today)