Home / Videos / Video: డాన్స్ చేస్తూనే…పాదాలతో పెయింటింగ్ వేసి గిన్నిస్ రికార్డు సాధించిన తెలుగు అమ్మాయి.

Video: డాన్స్ చేస్తూనే…పాదాలతో పెయింటింగ్ వేసి గిన్నిస్ రికార్డు సాధించిన తెలుగు అమ్మాయి.

Author:

చేతులతో పెయింటింగ్ వేసి అనేక రికార్డులని సాధించిన వాళ్ళని మనం ఎంతోమందిని చూసాం, కానీ పాదాలతో పెయింటింగ్ వేయడమే మనం అరుదుగా చూస్తుంటాం.. కానీ డాన్స్ వేస్తూ అద్భుతమైన పెయింటింగ్ వేయడం మాత్రం మనం సినిమాలోనే చూసాం..ఇప్పుడు ఒక తెలుగు అమ్మాయి ఈ ఘనతని సాధించింది, డాన్స్ చేష్టు పెయింటింగ్ వేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించి మన తెలుగువాళ్ళకు గర్వకారణంగా నిలిచింది.

గిన్నిస్ రికార్డ్

హైదరాబాద్ కి చెందిన తెలుగు అమ్మాయి జాహ్నవి (19 ) శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించడంలో దిట్ట, పెయింటింగ్ వేయడంలో కూడా మంచి నైపుణ్యం ఉంది, డ్యాన్స్ చేస్తున్నప్పుడే పెయింటింగ్ వేయగల అరుదైన కళ జాహ్నవి సొంతం. హైదరాబాద్ లోని ల్యాంకో హిల్స్ లో డాన్స్ చేస్తూ పాదాలతో 140 మీటర్ల పెయింటింగ్ వేసి గిన్నిస్ రికార్డుని సాధించింది, నృత్యం చేస్తూ నెమలి ఫించం, తామర పుష్పాలను పాదంతోనే వేసి ఇప్పటివరకు ఉన్న 100 చ.మీ గిన్నిస్ రికార్డుని అధిగమించింది, శాస్త్రీయ నృత్యంలో , పెయింటింగ్ లో అద్భుత నైపుణ్యం ఉన్న జాహ్నవి బాస్కెట్ బాల్ క్రీడలోను జాతీయ స్థాయి ప్లేయర్ కూడా.

(Visited 98 times, 1 visits today)