Home / Entertainment / జై సింహా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

జై సింహా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

జై సింహా రివ్యూ

Alajadi Rating

2.75/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: బాలకృష్ణ, నయనతార, ప్రకాష్ రాజ్, హరిప్రియ, జగపతి బాబు.. తదితరులు

Directed by: కెఎస్ రవికుమార్

Produced by: సి కళ్యాణ్

Banner: సికె ఎంటర్టైన్మెంట్స్

Music Composed by: చిరంతన్ భట్

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా మూడో సంవత్సరం సంక్రాంతి బరిలోకి వస్తున్నాడు, గత సంవత్సరం గౌతమిపుత్ర శాతకర్ణి తో హిట్ కొట్టిన బాలయ్య, ఈసారి కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో పక్క కమర్షియల్ కథతో జై సింహా గా వస్తున్నాడు, మరి బాలయ్య సంక్రాంతి బరిలో గెలిచాడా లేదా తెలుసుకోండి.

కథ:

ఉద్యోగం కోసం నరసింహ(బాలకృష్ణ) ఒక చిన్న పాపతో విశాఖపట్నం నుంచి కుంభకోణం వెళ్తాడు. అక్కడ ఒక కేసు విషయంలో జైలుకి వెళ్తాడు, దీంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇదే సమయంలో గౌరి (నయనతార) నరసింహని వెతుక్కుంటూ కుంభకోణం వస్తుంది. అసలు నరసింహకి, గౌరీకి సంబంధం ఏంటి..? నరసింహ కుంభకోణం ఎందుకు వచ్చాడు..? నరసింహ వైజాగ్ లో ఏం చేసేవాడు..? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

జైసింహా సినిమా బాలకృష్ణ నటించిన పక్కా మాస్‌, కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ అభిమానులను ఆకట్టుకునేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. దీనికి బాలకృష్ణ యాక్షన్‌ తోడవడంతో ఆయా సన్నివేశాలు అభిమానులని అలరింపచేస్తాయి. ముఖ్యంగా బాలకృష్ణ చెప్పే డైలాగ్‌లు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటాయి. ‘అమ్మకుట్టి’ పాటలో డాన్స్ అయితే బాలకృష్ణ సూపర్బ్ గా చేశాడు, కుంభకోణంలో తీసిన యాక్షన్‌ సన్నివేశాలు ఫస్టాఫ్‌కు హైలైట్‌గా నిలిచాయి. కాకపోతే కొన్ని కామెడీ సీన్స్ బోర్ కొట్టిస్తాయి.

ఫస్టాఫ్ లో నయనతార ఎంట్రీతో ఒక ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ వస్తుంది, ఇక సెకండ్ ఆఫ్ లో నయనతార, బాలకృష్ణ చుట్టూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది, బాలకృష్ణ, నయనతార, ప్రకాష్ రాజ్ మధ్యలో చాలా సెంటిమెంట్ సీన్స్ వస్తాయి, అవి కొంచెం ఓవర్ అనిపిస్తాయి,మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ బోర్ కొట్టిస్తే.. యాక్షన్ సీన్స్ అలరిస్తాయి..మొత్తానికి మరోసారి మరో రొటీన్ స్టోరీతో బాలకృష్ణ చేసిన సినిమాయే జై సింహా.

నటీనటుల పెర్ఫార్మన్స్:

బాలకృష్ణ పాత్ర నరసింహ నాయుడు, సమరసింహా నాయిడు స్టైల్లో రెండు రకాలుగా ఉంటుంది, ‘అమ్మకుట్టి’ పాటలో బాలయ్య స్టెప్పులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ నయనతారకు మాత్రమే స్కోప్ ఉన్న పాత్ర దొరికింది, మిగిలిన ఇద్దరివీ గ్లామర్ రోల్స్ మాత్రమే, సినిమా మొత్తం బ్రహ్మానందం ఉన్నప్పటికీ కామెడీ అంతగా వర్క్ అవుట్ కాలేదు, ప్రకాష్ రాజ్ పాత్ర కూడా రొటీన్ యే, ఇక విలన్ లు చాలామందే ఉన్నారు, వాళ్ళు బానే చేశారు.

ప్లస్ పాయింట్స్:

  • బాలకృష్ణ డైలాగ్స్, డాన్స్
  • నయనతార
  • యాక్షన్ ఎపిసోడ్స్
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ
  • కామెడీ ఎపిసోడ్స్

పంచ్ లైన్: ఫ్యాన్స్ కోసం మరో ఓవర్ యాక్షన్ ఎంటర్టైనర్.

(Visited 690 times, 1 visits today)