Cast: అల్లరి నరేష్, సాక్షి చౌదరి, ఆశిష్ విద్యార్ధి
Directed by: సాయికిషోర్ మచ్చ
Produced by: రామబ్రహ్మం సుంకర
Banner: ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి.
Music Composed by: సాయి కార్తీక్
ఈ మధ్య వరుస ఫ్లాప్ లతో చతికిలపడ్డ అల్లరి నరేష్ కి మస్ట్ అంద్ షుడ్ గా హిట్టు అవసరం అని తెలిసి చాలా సినిమాలు రిజెక్ట్ చేసి సెలెక్త్ చేసి మరీ చేస్తున్న సినిమా కబట్టి జేమ్స్ బాండ్ మీద్ భారీ అంచనాలే ఉన్నాయి. అయితే రిలీజ్ కు ముందు నుంచే ఈ సినిమా ఓ హాలివుడ్ సినిమా జిరాక్స్ అని ప్రచారం రావడం నిజంగా మైనస్సె.. ఛూద్దం మరి ఈ జేమ్స్ బాండ్ పేల్చాదొ ? లేక పేలి పోయాడో..?
కథ :
హీరో నాని(అల్లరి నరేష్) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి.బాగా భయస్తుడు..గొడవలకి దూరంగా ఉండే నానికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. బులెట్ అలియాస్ పూజ (సాక్షి చౌదరి) దుబాయ్ మొత్తాన్ని రూల్ చేసే మాఫియా డాన్. తన మదర్ కాన్సర్ వల్ల చనిపోయే స్టేజ్ లో ఉంది అనడం వల్ల తన మాఫియా బ్యాక్ డ్రాప్ గురించి తెలియకుండా తన దందా మొత్తాన్ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసి తన మదర్ కి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది. పూజ మదర్ తను పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని చెప్పడంతో పూజ ఓ అబద్దపు పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తోంది. కానీ నాని ఓ రోజు పూజని చూసి ఇష్టపడి, తన బ్యాక్ డ్రాప్ గురించి తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్ళైన కొద్ది రోజులకి పూజ ఊహించినట్టు సాఫ్ట్ బ్యూటీ కాదని, డేంజరస్ లేడీ మాఫియా డాన్ అని తెలవడం తో నాని తన నుంచి తప్పించుకొని పారి పోవాలని త్రై వేస్తాడు. లేడీ డాన్ నుంచి తప్పించుకోవడానికి నాని వేసిన ఎత్తులు ఏంటి.? చివరికి తప్పించుకున్నడా.? లేదా.? అదే టైంలో పూజని చంపాలనుకుంటున్న మరో మాఫియా డాన్ బడా(ఆశిష్ విద్యార్ధి) ఏం చేసాడు.? అన్నదే అసలు కథ.
ఎనాలిసిస్:
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన డైరెక్టర్ సాయి కిషోర్ తొలి సినిమా ఇది.. కానీ జేమ్స్ బాండ్ కథ విషయంలో తను పెద్ద కేర్ తీసుకోలేదని అనిపిస్తుంది. 2001 లో కొరియాలో వచ్చిన ‘మై వైఫ్ ఈజ్ అ గ్యాంగ్ స్టర్’ అనే సినిమా కథని యాజిటీజ్ గా దించేసాడు.ఆ సినిమాలోని సీన్స్ 60% మనకు ఇందులో కనిపిస్తాయి. అలాగే అక్కడ సిస్టర్ సెంటిమెంట్ ఉంటె ఇక్కడ మదర్ సెంటిమెంట్ పెట్టారు అంతే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్. సరే కథని సరిగా రాసుకోకపోయినా స్క్రీన్ ప్లే లో అన్నా జాగ్రత్తలు తీసుకోవాలి కదా, సాయి కిషోర్ అది కూడా సరిగా చేయకపోవడం మరో మైనస్. సినిమా ఆసక్తిగా మొదలుతుంది.. కానీ ఒక 15 నిమిషాల తర్వాత బాగా స్లో అయిపోతుంది. అక్కడక్కడా రెండు కామెడీ బిట్స్ వస్తుంటాయి, మళ్ళీ స్లో..
అల్లరోడి సినిమా అనగానే కడుపుబ్బా నవ్వుకోవచ్చు అనే ఫీలింగ్ తోనే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు. కానీ ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ చాలా సార్లు ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఎప్పటి లానే ఈ సారి కూడా అల్లారి నరేష్ ఆడియన్స్ ని నవ్వించడంలో ఫెయిల్ అయ్యాడు. మరీ రెగ్యులర్ అండ్ రొటీన్ ఎంటర్ టైనర్స్ కి డై హార్డ్ ఫ్యాన్ అయ్యుంటే ఈ సినిమా ఒక పరవాలేదు బాగానే ఉండనే ఫీలింగ్ వస్తుంది. బ్రదర్ అఫ్ బొమ్మాళి ఇలాంటి ఫార్మాట్ లోనే వచ్చినా ఆడియన్స్ ని కాసింత నవ్వించగలిగింది, కానీ ఇది మాత్రం నవ్వించలేకపోయింది. బందిపోటు లాంటి టోటల్ డిజప్పాయింట్ మెంట్ తర్వాత అల్లరి నరేష్ ఈ సారి జేమ్స్ బాండ్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడు అనుకున్నారు, కానీ ఇది కూడా నిరుత్సాహాన్నే మిగిల్చింది.’బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమాలో ఓ సిస్టర్ పెట్టే టార్చర్ తో ప్రేక్షకులను నవ్వించిన అల్లరి నరేష్ ఈ సినిమాలో మాఫియా డాన్ అయిన తన వైఫ్ పెట్టే టార్చర్ తో నవ్వించడానికి ట్రై చేసాడు. అల్లరి నరేష్ బాడీ లాంగ్వేజ్ కి బాగా సూట్ అయ్యే సీన్స్ కొన్ని డైరెక్టర్ రాసుకున్నాడు. ఆ సీన్స్ ని అల్లరోడు బాగా చేసాడు. అల్లరి నరేష్ కి ఇలాంటి పాత్ర చేయడం ఇదేమీ మొదటిసారి కాదు కాబట్టి సునాయాసంగానే చేసుకుంటూ వెళ్ళాడు. ఇక మరో లీడ్ చేసిన సాక్షి చౌదరి విషయానికి వస్తే.. ఒక లేడీ డాన్ లుక్ లో సాక్షి చౌదరి పోస్టర్ అదిరింది. ఈ సినిమాలో తను చేసిన రిస్కీ స్టంట్స్ బాగున్నాయి.ఇక గ్లామర్ పరంగా అందాలను బాగానే ఆరబోసి మాస్ ఆడియన్స్ ని మెప్పించింది. అల్లరి నరేష్ ఫ్రెండ్ గ చేసిన ప్రవీణ్ తన దిన స్టైల్ లో నవ్వించాడు. ముఖ్యంగా అల్లరి నరేష్ ప్రవీణ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ బాగున్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీ సిఈఓ గా పోసాని కాసేపు బాగానే నవ్వించాడు. ఒక ఎపిసోడ్ లో పృథ్వి కూడా నవ్వించాడు. హేమ, ప్రభ, శ్రవణ్ లు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఆశిష్ విద్యార్ధి నెగటివ్ శేర్డ్స్ ఉన్న పాత్రలో డీసెంట్ అనిపించాడు.సాయి కార్తీక్ కంపోజ్ చేసిన సాంగ్స్ లో ఒకటి రెండు బాగున్నాయి. దాము నర్రావు సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ని బాగా కలర్ఫుల్ గా చూపించాడు. శ్రీధర్ సీపాన రాసిన డైలాగ్స్ లో పంచ్ లు బాగానే పేలాయి. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- కొంచం కామెడి
- హీరొయిన్ గ్లామర్
మైనస్ పాయింట్స్:
(Visited 117 times, 1 visits today)