Home / Entertainment / జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా..!

జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా..!

Author:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘జనతా గ్యారేజ్’, ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ లకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది, ఈసారి ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాలని చాలా కసితో ‘జనతా గ్యారేజ్’ టీం పని చేస్తుంది, సినిమా ప్రారంభంలోనే రిలీజ్ డేట్ ప్రకటించి.. అందుకు తగ్గట్లుగా షూటింగ్ పూర్తి అవుతోందంటూ జనతా గ్యారేజ్ యూనిట్ అప్ డేట్స్ కూడా ఇచ్చింది. ఆగస్ట్ 12 డేట్ న ఖచ్చితంగా విడుదల ఉంటుందని చెప్పడంతో.. అందుకు అనుగుణంగా మిగిలిన సినిమాల ప్లానింగ్స్ జరిగాయి.

Janata-Garage-Postponed-జనతా గ్యారేజ్

కానీ ఇప్పుడు విడుదల తేదీని హఠాత్తుగా వాయిదా వేశారు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ 2 కి మారుస్తున్నట్టు ‘జనతా గ్యారేజ్ ‘ యూనిట్ ప్రకటించారు, అభిమానులు సినిమాపై పెట్టుకున్న అంచనాలన్నీ నిజం చేసేలానే సినిమా ఉంటుందని టీమ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది, లేట్ అయిన బెస్ట్ ఔట్ ఫుట్ తో సినిమాని తెస్తామని చెప్పుకొచ్చారు, ఆగస్టు మధ్యలో జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ ఉంటుందని డేట్ తరువాత ప్రకటిస్తామని చెప్పారు.

Must Read: Video: జనతా గ్యారేజ్ టీజర్…!

(Visited 346 times, 1 visits today)