Home / Entertainment / 100 కోట్లతో జనతా గ్యారేజ్ కొత్త రికార్డు.

100 కోట్లతో జనతా గ్యారేజ్ కొత్త రికార్డు.

Author:

జనతా గ్యారేజ్ సినిమా పేరు ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా అన్ని రికార్డులకి రిపేర్లు చేస్తుందని అంచనా వేశారు, ఆ అంచనాలని మించిన కలెక్షన్స్ తో జనతా గ్యారేజ్ పాత రికార్డులకి రిపేర్లు చేసి కొత్త రికార్డులని సృష్టిస్తుంది, నాన్ – బాహుబలి రికార్డులని, కొన్ని చోట్ల బాహుబలి రికార్డులని కూడా జనతా గ్యారేజ్ దాటేసింది, ఇప్పటికే అతి తక్కువ సమయంలో 50 కోట్లని వసూలు చేసిన తెలుగు సినిమాగా కొత్త రికార్డుని సృష్టించిన జనతా గ్యారేజ్ వారం తిరిగే సరికి 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. బాహుబలి తరువాత వారం రోజులలో 100 కోట్ల గ్రాస్ ని దాటినా సినిమాగా జనతా గ్యారేజ్ రికార్డు సృష్టించింది,వారం రోజుల్లో 100 కోట్ల గ్రాస్ తో 62 కోట్ల రూపాయలని జనతా గ్యారేజ్ వసూలు చేసింది. ఇదే ఊపు కొనసాగితే శ్రీమంతుడు సినిమా కలెక్షన్స్ (85 కోట్లు) ని దాటేసిన ఆశర్యపోవాల్సిన అవసరం లేదు.

janatha-garage-collections

విడుదల అయిన రోజు రివ్యూలు అన్ని యావరేజ్ గా వచ్చిన కలెక్షన్స్ మాత్రం బ్లాక్ బ్లాస్టర్ రేంజ్ లో వస్తున్నాయి, ఇప్పుడున్న స్టార్ హీరోలు సినిమాలు చేయడం మొదలుపెట్టకముందే ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కానీ 50 కోట్లని వసూలు చేయడానికి 2016 వరకు ఆగాల్సి వచ్చింది,50 కోట్ల క్లబ్ లోకి చేరడానికి నాన్నకి ప్రేమతో సినిమాకి నెల రోజుల సమయం పడితే జనతా గ్యారేజ్ కేవలం 4 రోజుల్లోనే 50 కోట్లని వసూలు చేసింది, అమెరికాలో 1.5 మిలియన్ డాలర్లకి వసూలు చేసి 2 మిలియన్ డాలర్ల మార్క్ ని చేరుకోవడానికి దగ్గర్లో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 62 కోట్ల దాకా వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నిలిచింది, ఇప్పుడు జనతా గ్యారేజ్ తో 80-90 కోట్ల దాకా వసూలు చేయవచ్చు అని ట్రేడ్ పండితులు అంటున్నారు.

జనతా గ్యారేజ్ కలెక్షన్స్:

  • Naizam: Rs. 14.59 Cr
  • Ceeded:  Rs. 8.36 Cr
  • W.Godavari: Rs. 3.33 Cr
  • E.Godavari: Rs. 3.76 Cr
  • Guntur: Rs. 4.67 Cr
  • Vizag: Rs. 5.37 Cr
  • Krishna: Rs. 3.29 Cr
  • Nellore: 1.66 Cr

AP and TS 6 Days Total Collections: 45.03 Cr

USA 6 Days Collections : 10.20Cr

Rest of India & World Collections: 7 Cr

Janatha Garage First 6 Days Total Collections: Rs. 62.33 Cr (Only Estimated, actual’s may vary and will be updated soon)

(Visited 1,450 times, 1 visits today)