Home / Inspiring Stories / చదువు మాత్రమే కాదు జీవితం నేర్పిస్తున్న జపాన్ పాఠశాలలు.

చదువు మాత్రమే కాదు జీవితం నేర్పిస్తున్న జపాన్ పాఠశాలలు.

Author:

పాఠశాల ప్రతి చిన్నారికి చదువు చెప్పి, జీవితంలో ఒక మంచి దారిని చూపించే దేవాలయం. ఇంతకుముందు పల్లెటూర్ల దగ్గర నుండి పట్టణాల వరకు అలాంటి పాఠశాలలే ఉండేవి.. కాలం మారింది ఇప్పుడు చదువు జీవితాన్ని నేర్పించడానికి బదులు ఒక స్టేసస్ సింబల్ లా మారింది. ఎంత గొప్ప పాఠశాలలో చదివితే అంత గొప్ప పేరు వస్తుందని లక్షలకు లక్షలు పొసి చదువును కొంటున్నారు మరి ఆ పాఠశాలలు చిన్న వయసు నుండే అర్దం పర్దం లేని సిలబస్ ను చిరు మెదళ్ళలోకి దూర్చి వారికి సమాజం గురించి పట్టించుకొనే తీరిక లేకుండా చేస్తున్నాయి. ఒక చిన్న పిల్లాడికి ఎం నేర్పాలోజపాన్  లో ఒక ప్రభుత్వ పాఠశాలలో తీసిన ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

చిన్న పిల్లలను చిన్న తనంలోనే సరైన పద్దతుల్లో పెంచితే వారు ఆ మంచి పద్దతులనే పాటిస్తారు, అదే పని జపాన్లోని పాఠశాలలు చేస్తున్నయి. విద్యార్దులకు కలిసి మెలిసి ఎలా పని చేయాలో, తమ పని తామే ఎలా చేసుకోవాలో, పెద్దవారిని ఎలా గౌరవించాలో మరియు మనకు సాయం చేసిన వారికి ఎలా కృతజ్ఞత తెలపాలో కూడా ప్రతి రోజు మధ్యాన్న భోజన సమయంలో నేర్పిస్తారు. అంతే కాదు తమ పాఠశాలను తామే క్లీన్ చేసుకుంటున్న విద్యార్దులను వీడియోలో చూడవచ్చు.

(Visited 1,672 times, 1 visits today)