Home / Latest Alajadi / జియో ఫ్రీ ఆఫర్ మార్చి వరకు పెంపు.

జియో ఫ్రీ ఆఫర్ మార్చి వరకు పెంపు.

Author:

జియో ఆఫర్ అమలులోకి వచ్చినప్పటి నుండి సంచలనాలు సృష్టిస్తుంది, ఇప్పటికి జియో సిమ్ కోసం రిలయన్స్ స్టోర్ ల ముందు జనాలు క్యూలో నిల్చుంటున్నారు, జియో ఆఫర్ దెబ్బకి మిగిలిన కంపెనీలు అన్ని కిందికి దిగి వచ్చాయి, ఎయిర్ టెల్, ఐడియా, వోడా ఫోన్ వారు కొత్త కొత్త ఆఫర్స్ ని ప్రకటిస్తున్నారు కానీ ఆ ఆఫర్స్ ఏమాత్రం జియో ఆఫర్ దగ్గరికి రాలేకపోతున్నాయి, మొదట్లో జియో ఉచిత సేవలు డిసెంబర్ వరకు మాత్రమే ఉంటాయని ప్రకటించిన ఇప్పుడు ఆ సేవలని మరో మూడు నెలలు పొడిగించాలని భావిస్తోంది రిలయన్స్. ఉచిత 4జీ డేటా, వాయిస్ కాల్స్, కాల్ డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులను 2017 మార్చి వరకు ఉచితంగా కస్టమర్లకు ఇవ్వాలని ఆలోచిస్తుంది.

jio-offer-extended-upto-march

భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) నిబంధనల ప్రకారం ఏ టెలికాం ఆపరేటర్ కూడా వెల్‑కమ్ ఆఫర్ కింద ఉచిత సేవలను 90 రోజుల కంటే ఎక్కువ రోజులు అందించడానికి వీలులేదు. దీని ప్రకారం డిసెంబర్ 3 వరకే జియో ఉచిత సేవలు పని చేయాలి, ఆ తరువాత కస్టమర్ల నుండి చార్జీలు వసూలు చేయాలి, కానీ జియో మాత్రం ఉచిత సేవలని మార్చి వరకు పొడిగిస్తాం అని ప్రకటించింది, ఇంటర్- కనెక్టివిటీ సమస్యల వల్ల జియో కస్టమర్లకి నాణ్యమైన 4G , వాయిస్ కాల్స్ సేవలని అందిచలేకపోతున్నాం అని, ఇతర టెలికాం కంపెనీలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి అని అందువల్ల ఉచిత సేవల గడువుని మార్చి వరకు పెంచడానికి సన్నాహాలు చేస్తున్నాం అని రిలయన్స్ జియో స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ అధినేత అన్షుమాన్ థాకూర్ తెలిపారు, జియో సేవల పొడిగింపు నిర్ణయం పై ట్రాయ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

(Visited 5,330 times, 1 visits today)