Home / Inspiring Stories / జియో ఆఫర్: రూ.10 కి 1 GB డేటా తో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, SMS లు..!

జియో ఆఫర్: రూ.10 కి 1 GB డేటా తో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, SMS లు..!

Author:

రిలయన్స్ జియో టెలికం రంగంలో అడుగుపెడుతూనే సరికొత్త సంచలనాలు సృష్టించింది, జియో ఆఫర్ల దెబ్బకి మిగిలిన టెలికం నెట్ వర్క్ లు బెంబేలెత్తిపోయాయి, మొదట సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు జియో వెల్ కం ఆఫర్ పేరిట ఉచితంగా 4G డేటా , ఉచితంగా వాయిస్ కాల్స్ , SMS లు ఇచ్చిన జియో , జనవరి 1 నుండి హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట కూడా అదే ఆఫర్ ని మార్చి 31 వరకు పొడిగించారు, సిమ్ నుండి అన్ని ఉచితంగానే ఇస్తుడటంతో రికార్డు స్థాయిలో కస్టమర్లని జియో సంపాదించుకుంది, జియో ఉచిత ఆఫర్ ఈ నెల 31 న ముగియనుంది, ఆ తరువాత కూడా జియో సేవలని వాడుకోవాలంటే మార్చి 31 లోపు రూ.99 చెల్లించి జియో ప్రైమ్ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది.

Jio-Plans

జియో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వారు 4G డేటా కోసం రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది, రూ.303 పెట్టి రీఛార్జి చేసుకుంటే నెల రోజుల పాటు 28 GB జియో 4G డేటాని , అపరిమిత వాయిస్ కాల్స్ ని , అపరిమిత SMS లని పొందవచ్చు, అంటే దాదాపు 10 రూపాయలకి 1 GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ మరియు అపరిమిత SMS సేవలని పొందవచ్చు, ఇతర నెట్ వర్క్ లలో అయితే డేటా కోసం ఒక రీఛార్జి, వాయిస్ కాల్స్ కోసం ఒక రీఛార్జి , SMS సేవల కోసం మరొక రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది, కానీ జియో లో ఒకే రీఛార్జితో అన్ని సేవలను పొందవచ్చు, వీటితో పాటు అనేక ప్లాన్ లని జియో ప్రకటించింది, ఆ ఆఫర్ల కోసం జియో ( www.jio.com ) వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.

Reliance-Jio-Prime-Plans

(Visited 7,236 times, 1 visits today)