Home / Latest Alajadi / జాన్సన్ బేబీ పౌడర్ తో క్యాన్సర్ , రూ.700 కోట్లు జరిమానా విధించిన కోర్ట్.

జాన్సన్ బేబీ పౌడర్ తో క్యాన్సర్ , రూ.700 కోట్లు జరిమానా విధించిన కోర్ట్.

Author:

చిన్న పిల్లలకి ఎక్కువగా ఉపయోగించే జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) కంపెనీకి చాలా పెద్ద షాక్ తగిలింది, ఆ కంపెనీ పౌడర్ వాడటం వల్ల తనకు గర్భాశయ క్యాన్సర్ సోకిందని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో… 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది మిస్సోరి కోర్ట్, మన కరెన్సీలో దాదాపు రూ.700 కోట్ల పైమాటే. అమెరికాలోని వర్జీనియా ప్రాంతానికి చెందిన లూయిస్ స్లెంప్ అనే మహిళకు గర్భాశయ క్యాన్సర్ సోకినట్టు 2012లో తేలింది. ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు, తనకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ పౌడర్ వల్లనే కాన్సర్ సోకిందని కోర్ట్ లో ఫిర్యాదు చేసింది.

johnsons baby powder

గత నలబై ఏళ్లుగా జాన్సన్ అండ్ జాన్సన్, జాన్సన్ బేబీ పౌడర్, షోవర్ టు షోవర్ పౌడర్ ఉపయోగించడం వల్ల తనకు క్యాన్సర్ సోకినట్టు లూయిస్ ఆరోపించింది. కాగా ఇందులో పౌడర్ సరఫరాదారు ఇమెరీస్ తప్పు 1 శాతం ఉంటే జే అండ్ జే తప్పు 99 శాతం ఉందని కోర్టు తేల్చింది. ఇమెరీస్‌కి 50 వేల డాలర్లు జరిమానా వేసింది. బహుళ ప్రాచుర్యం పొందిన జాన్సన్ బేబీ పౌడర్ సహా ఇతర పౌడర్ ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉన్నట్టు.. వినియోగదారులకు జే అండ్ జే సరైన హెచ్చరికలు ఇవ్వడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదే ఆరోపణలతో సదరు కంపెనీపై 2400 కేసులున్నట్టు వెల్లడించింది.

ఇంతకు ముందు కూడా ఇలాంటి మూడు కేసుల్లో జే అండ్ జే కంపెనీ మొత్తం 197 మిలియన్ డాలర్లు సమర్పించుకుంది. ‘‘ఈ తీర్పుతో కంపెనీలు మహిళల పట్ల తమ కనీస బాధ్యతను విస్మరిస్తున్నట్టు, శాస్త్రీయ ఆధారాలను నిర్లక్ష్యం చేస్తున్నట్టు మరోసారి రుజువైంది’’ అని లూయిస్ తరపు న్యాయవాది టెడ్ మిడోస్ వ్యాఖ్యానించారు. మరోవైపు సదరు మహిళకు క్యాన్సర్ సోకడంపై సానుభూతి వ్యక్తం చేస్తూనే… ఈ తీర్పును సవాలు చేసేందుకు సిద్ధపడుతున్నట్టు జాన్సన్స్ కంపెనీ వెల్లడించింది.

(Visited 2,372 times, 1 visits today)