Home / Inspiring Stories / జాన్సన్ & జాన్సన్ పౌడర్ వాడటం వల్ల కాన్సర్ తో మరణించిన మహిళ.

జాన్సన్ & జాన్సన్ పౌడర్ వాడటం వల్ల కాన్సర్ తో మరణించిన మహిళ.

Author:

Jhonson and Jhonson Powder

చిన్న పిల్లల పౌడర్ ని తయారుచేసే ప్రముఖ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కి అమెరికా కోర్ట్ భారి జరిమానా విధించింది, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారుచేసిన పౌడర్ ని వాడి అమెరికా లో ఒక మహిళా అండశయ ముఖద్వార కాన్సర్‌తో మరణించడంతో.. ఆమె కుటుంబానికి సుమారు రూ.493 కోట్ల పరిహారం చెల్లించాలని అమెరికా కోర్టు సంచలన తీర్పును ప్రకటించింది.

అమెరికాలో నివసించే జాకీ ఫాక్స్ (62) అనే మహిళ కొన్ని సంవత్సరాల నుండి జాన్సన్ & జాన్సన్ బేబీ పౌడర్ ని వాడుతుంది, ఆమె 2013 లో కాన్సర్ వ్యాధితో మరణించింది, దీంతో ఆమె కొడుకు కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశాడు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేసిన వాళ్ల పౌడర్‌ను వాడడం వల్లే తన తల్లి అండాశయ ముఖద్వార కేన్సర్‌తో మరణించిందని ఫాక్స్ కుమారుడు కోర్ట్ కి తెలిపాడు.

ఈ కేసు పై విచారణ జరిపిన కోర్ట్, టాల్క్ బేస్‌డ్ ఉత్పత్తుల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్న విషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్‌కి తెలిసి కూడా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉండడాన్ని తప్పు పట్టింది, ఈ అంశంపై అమెరికా వ్యాప్తంగా 1500 కి పైగా కేసులు నడుస్తున్నాయని టాల్క్ బేస్‌డ్ ఉత్పత్తులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ 493 కోట్ల రూపాయలను ఫాక్స్ కొడుకుకి చెల్లించాలని తీర్పుని ప్రకటించింది.

మన దేశంలో ఎక్కువ మంది తల్లలు తమ పిల్లలకి జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్లు, క్రీమ్ లను, షాంపూలనే వాడుతుంటారు, అవి మాత్రమే కాదు మనం ప్రతి రోజు అన్ని రకాల పౌడర్లలో టాల్క్ ఖచ్చితంగా ఉంటుంది, కాని అది ప్రమాణాల మేరకు ఉంటె ఎటువంటి ప్రమాదం ఉండదు,కాని ఆ పౌడర్లని ఎక్కువగా వాడటం వల్ల కూడా కాన్సర్ వచ్చే అవకాశం ఉందని కాన్సర్ వ్యాది నిపుణులు చెప్తున్నారు.

(Visited 1,370 times, 1 visits today)