Home / Entertainment / శ్రీకృష్ణుడుగా జూనియర్ !

శ్రీకృష్ణుడుగా జూనియర్ !

Author:

శ్రీమంతుడు’ విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న నేపధ్యంలో ‘బాహుబలి’ కలెక్షన్స్ పడిపోకుండా ఆ హవాను కొనసాగించడానికి మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులలో ‘బాహుబలి’ ఫీవర్ ను కొనసాగించడానికి రాజమౌళి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ జూనియర్ గురించి తనకున్న డ్రీమ్ వెల్లడించాడు. పది సంవత్సరాలయినా సరే  ‘మహాభారతం’ సినిమా తీయడం మాత్రం ఖాయం అని చెపుతున్న రాజమౌళిని ‘మహాభారతం’ సినిమాలో శ్రీకృష్ణుడుగా ఎవరు కనబడనున్నారు అని అడిగినప్పుడు ఒక్క నిముషం కూడ ఆలోచించకుండా, తడుముకొకుండా తాను తీయబోయే ‘మహాభారతం’ లో శ్రీకృష్ణుడుగా జూనియర్ మాత్రమే అంటూ తన ప్లాన్ తెలియచేసాడు రాజమౌళి. అంతేకాదు ఈ పాత్రను పోషించగల సత్తా ఒక్క జూనియర్ కు తప్ప మరెవ్వరికీ ఉండదు అంటూ సంచలన కామెంట్స్ చేసాడు జక్కన్న. తన తాత నందమూరి తారకరామారావులోని హావభావాలు డిక్షన్ పొల్లుపోకుండా ఏకాగ్రతతో నటించి చూపెట్టగల సామర్ధ్యం  కేవలం జూనియర్ కు మాత్రమే సొంతం అని అంటూ భవిష్యత్లో ఎవరైనా పురాణ పాత్రలతో కూడిన సినిమాలు చేయాలి అంటే ఒక్క జూనియర్కు మాత్రమే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా జూనియర్ పై తనకు ఉన్న అభిమానాన్ని మరోసారి ప్రదర్శించాడు రాజమౌళి.‘మహాభారతం’ సినిమాను 5 భాగాలుగా తీస్తాను అని చెపుతున్న రాజమౌళి నిజంగా ఈసినిమా ప్రాజెక్ట్ ను మొదలు పెడితే మొత్తం ఈ సినిమా పూర్తి అయ్యే సరికి జూనియర్ కు ఎన్నేల్లు పడుతుందొ? బాహుబలికే ఇంత సమయం తీసుకున్న జక్కన్న భారతం కి ఎన్నెల్లు తీస్కుంటాడొ మరి.. కాని అంతకాలం తన మిత్రుడు రాజమౌళి కోసం జూనియర్ కేటాయించగలడా అన్నదే సందేహం. ఏది ఎలా ఉన్నా రాజమౌళి నిర్ణయం జూనియర్ కు జోష్ ను ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..

(Visited 63 times, 1 visits today)