Home / Inspiring Stories / కలుపుకుంటరా..! గీమె మాకద్దు అంటరా..?

కలుపుకుంటరా..! గీమె మాకద్దు అంటరా..?

Author:

తెలంగాణా లో మరో వివాదం రాజుకోనుందా? ఎప్పటినుంచో ఆంధ్రా ఆధిపత్యం మాకొద్దు అనే తెలంగాణా ప్రజలు ఆంద్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం నుంచి. తమ రాష్ట్రాన్ని వేరుగా ఏర్పాటు చేసుకునేంతగా ఆంధ్రా జోక్యాన్ని వద్దనుకున్నారు.తెలంగాణా వస్తే అన్ని కీలకమైన పోస్టుల్లోనూ,కీలక స్థానాల్లోనూ తమ వారే ఉంటారని భావించారు తెలంగాణా పౌరులు. కానీ పరిస్తితి మారిందా? కొన్ని సార్లు ఆంధ్ర ప్రదేశ్ మూలాలున్న వారు కొన్ని విశయాల నిర్వహణకి నియమించబడితే తెలంగాణా ప్రజలు దాన్ని ఆమోదిస్తారా? ఇప్పుడు తాజా పరిణామాలని చూస్తే ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలు విశయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు కుమార్తె. సినీనటి మంచు లక్ష్మి ని ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన అధికార బాధ్యతల్ని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ నెల 10న మంచు లక్ష్మి తీసుకోనున్నారు. గతం లో తెలంగాణా ఏర్పాటుకు పూర్తి వ్యతిరేకంగా నిలిచిన నటుడు మోహన్ బాబు కుమార్తె, సీమాంధ్ర మూలాలు ఉన్న మంచు లక్ష్మి నియామకం పట్ల తెలంగాణ వాదుల స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. తెలంగాణా రాకూడదని కోరుకొని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి విరుద్దంగా వ్యవహరించిన మోహన్ బాబు నీ, మంచు లక్ష్మి నీ, తెలంగాణా లో స్వచ్చ భారత్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం పట్ల ఎలాంటి స్పందిస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారుతుందని చెప్పక తప్పదు.

ఒక పక్క కేంద్రంలో అంటీముట్టనట్లుగా ఉన్న సమయంలోనే. మంచు లక్ష్మి ని తెలంగాణ స్వచ్ఛభారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకోవటం. తెలంగాణ సర్కారునూ, తెలంగాణా ప్రజలనూ అసంతృప్తికి గురి చేసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే. ఈ విషయంలో మరో మాట కూడా వినిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె. ఎంపీ కవితకు మంచు లక్ష్మి సన్నిహితురాలని, కాబట్టి ఆమె నియామకంపై ఎలాంటి పట్టింపులు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నచ్చినోళ్లకు పదవులు వస్తే.. ఇప్పటివరకూ వినిపించిన పట్టింపులు ఉంటాయో ఉండవో రానున్న రోజుల్లో తేలిపోవటం ఖాయం.తెలంగాణా ప్రభ్త్వం తమ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

(Visited 64 times, 1 visits today)