“అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయి” గురజాడ వారి ప్రఖ్యాత నాటకం కన్యాశుల్కం లో అగ్ని హోత్రావధానులు చెప్పేమాట ఇది. ప్రపంచం కన్ను తెరవక ముందే జంబూధ్వీపంగా పిలువబడ్ద ఇప్పటి భారతదేశ ప్రాంతం నైమిశారణ్య విశ్వవిధ్యాలయ ఖ్యాతీ కొన్ని సంవత్సరాలుగా వెనుకబడ్డాయి. మనుధర్మ శాస్త్రం లోనే తూనికలూ కొలతల వివరాలుండగా ఇప్పటికీ త్రాసుని కనిపెట్టిన మహానుభావుడిగా ఆర్కిమెడిస్ పేరు మాత్రమే చరితరపుటల్కెక్కింది. ఇప్పుడు మరోసారి అలాంటి విషయమే తెరమీదికొచ్చింది. పరమాణు సిద్దాంతానికి మూలమైన “అణు సిద్దాంతం” ప్రతిపాదించిన శాస్త్రవేత్తగా కణసిద్దాంత పితామహుడిగా జాన్ డాల్టన్ పేరునే ఇన్నాళ్ళూ చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇదే అణు సిద్దాంతాన్ని దాదాపు 2500 సంవత్సరాల క్రితమే భారతీయుడైన కణాదుడు ప్రతిపాదించాడు. ఈయన క్రీస్తుపూర్వం 2శతాబ్దానికి చెందిన అణు శాస్త్రవేత్త. జాన్ డాల్టన్ 1766-1844 మధ్య కాలపు శాస్త్రవేత్త..
నిజానికి రసవాదం పేరుతో తన ప్రయోగాలని మొదలు పెట్టిన కణాద మహర్షి మొట్టమొదటి అణు శాస్త్రవేత్త గా పిలువబడాలి. రసవాదం ఉపయోగించి పాదరసం వంటి లోహాలని బంగారంగా మార్చే ప్రక్రియ అప్పట్లో ఉపయోగం లో ఉన్నట్టు కొన్ని ఆధారాలు కూడా లభించాయి. మెర్క్యురీ(పాదరసం) అటామిక్ నంబర్ -80 ఆరం గా పిలవబడే బంగారం అటామిక్ నంబర్ -79. క్రీస్తు పుట్టుకకు ముందే ఈ విషయాన్ని కనిపెట్టిన భారతీయ శాస్త్రవేత్తలు రసవాదం పై విస్త్రుత పరిశోదనలు చేసారు. పాదరసాన్ని బంగారం గా మార్చే ప్రక్రీయ కోసం అప్పట్లోనే పరమాణు రహస్యాల శొధన మొదలయింది. ఇదే విషయంలో తన పరిశోదనని ఇప్పటి గుజరాత్ రాష్ట్రం లోని ద్వారక దగ్గలో ఉన్న ప్రభాస క్షేత్రం లో నే కణాదుడు కొనసాగించినట్టు చారిత్రక ఆధరాలున్నాయి.
సృష్టిలొని ప్రాణులన్నీ ముఖ్యంగా గాలీ, నీరూ, భూమీ(మృత్తిక) ల ఆధారం గానే నిర్మాణమౌతాయనీ, (చెట్లూ/కాయలు నీటిని కలిగిఉంటాయి, కీటకాలు నీటినీ, నిప్పునీ కలిగి ఉంటాయనీ, పక్షులు నీరూ, నిప్పూ, మృత్తిక ల మూలకాలని కలిగి ఉంటాయనీ, మానవదేహం అన్నిటికన్న సంక్లిష్ట మూలకాల నిర్మితమనీ అందుకే ఇవన్నీ అన్ని ఖనిజ పథార్థ నిర్మాణమైన భూమి ఆకర్షణ లో ఉంటాయనీ “గురుత్వ సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తూనే, భౌతిక రసాయణ శాస్త్రాల మధ్య సమన్వయాన్ని వివరించే ప్రయత్నం చేసారు.
కానీ కాల క్రమేణా భారతీయ శాస్త్రవేత్తల పేర్లు మరుగుణ పడి కణాదుని స్థానంలో అలెగ్జాండర్ వెలుగులోకి వచ్చారు. తన చేతిలోని ఆహారపు ముద్దని చూసి అనేక అణువులు కలిసి శక్తి కలిగిన ఒక పథార్థంగా ఏర్పడుతుందనే ప్రతిపాదనని కనిపెట్టిన కణాదుడు పైకి ఇప్పుడు ప్రపంచ శాస్త్ర వేత్తల దృష్టి మళ్ళింది. ఇప్పటికే అనేకమంది శాస్త్రవేత్తల బృందాలు కణాదుడు నివసించిన ప్రభాస క్షేత్రం లో ఆయన పరిశోదనా గ్రంథాల లోని విశయాలను వెలికి తీసే పనిలో పడ్డారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయం పై దృష్టి పెట్టాలనీ దీనిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకు వెళ్ళాలనీ పలువురు కోరుతున్నారు…