Home / Entertainment / కంచె కి ఖర్చెంత..?

కంచె కి ఖర్చెంత..?

Author:

కంచె ఇప్పుడు తెలుగు సినిమా లో ఒక సంచలనం. రెండో ప్రపంచ యుద్ద కాలం నటి కథ తో దర్శకుడు క్రిష్ ఇంకో లవ్ స్టోరీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో రెండో ప్రపంచ యుద్ద కాలం నాటి నిజమైన ఆయుధాలని వాడాం అని చెప్పారు క్రిష్. ఐతే అప్పటి వాతావరణాన్ని తలపించే సెట్స్ వేయాలన్నా, యుద్ద సన్నివేశాలని చిత్రించాలన్నా ఖర్చు భారీ గానే అవుతుంది మరి కంచె కి ఎంత అయింది?,  పూర్తిగా 21 కోట్లు ఖర్చు తో సినిమాని నిర్మించామని అంటున్నారు క్రిష్. ఖర్చు పెట్టిన ప్రతి పైసా తెర మీద కనిపిస్తుందంటున్నారు. ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినిమా బడ్జెట్ గురించి చెప్పారాయన. ఐతే వరుణ్ తేజ్ లాంటి కొత్త ఆర్టిస్ట్ కోసం ఇంత ఖర్చుపెట్టారా అని ఆశ్చర్య పోయే వాళ్ళకి  క్రిష్ సమాధానం ఒక్కటే. కథ కంటే హీరో ఎవరూ లేరు.

వరుణ్ తేజ్ నటన ఏంటో సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది అన్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు హాటెస్ట్ టాపిక్. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్రైలర్ అద్బుతంగా ఉందని చెప్పటం తో అందరి దృష్టీ కంచె వైపే మళ్ళింది. బడ్జెట్ ఎంతైనా సినిమా వసూలు చేయగలదనే ధీమాతో ఉన్నారు. నిజానికి అంత అద్బుతమైన స్క్రిప్ట్ ఈ మధ్య కాలంలో రాలెదంటున్నరు “కంచె” కి పని చేసిన వాళ్ళంతా. థియేటర్ల లోకి వచ్చాక వరుణ్ మార్కెట్ పెరుగుతుందనీ, వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఇదొక మైలు రాయిలాంటిదనీ అంటున్నారు.

క్రిష్ డబ్బుని పొదుపుగా వాడే దర్శకుడని పేరుంది. అలాంటి క్రిష్ ఇంత బడ్జెట్ ప్లాన్ చేసాడూ అంటే ఖచ్చితంగా సూపర్ హిట్ చేయగలననే నమ్మకం తోనే అంటున్నారు ఆయన సన్నిహితులు.

(Visited 39 times, 1 visits today)