Home / Devotional / కార్తీక మాసం మొత్తం పూజలు చేయకపోయినా…రేపు ఒక్క రోజు ఇలా చేస్తే సిరిసంపదలకు లోటు ఉండదు.!

కార్తీక మాసం మొత్తం పూజలు చేయకపోయినా…రేపు ఒక్క రోజు ఇలా చేస్తే సిరిసంపదలకు లోటు ఉండదు.!

Author:

కార్తీకమాసం ఇది ఒక రోజు పండుగ కాదు. నెల రోజుల పండుగ. కార్తీక మాసమంతా తెల్లవారక ముందే పరగడపున లేచి కృత్తికా నక్షత్రము అస్తమించేలో గానే నదులలో గాని తటాకాలలో గాని అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో తప్పక తలస్నానమాచరించాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.

డిసెంబర్ 7 వ తేదీన.దుర్ముహూర్తం లేని సమయం లో ఈ పూజ ను జరిపితే.. ఇంతవరకు ఆర్థికంగా ఎటు వంటి భాదలైతే ఉన్నాయో అవ్వన్నీ కూడా తొలగిపోతాయి…ఇందుకు మీరు చేయవలసిన పని..సిరి సంపదలనిచ్చు ఆ శ్రీ మహాలక్ష్మి ని పూజించడం.. ముందుగా శుచిగా స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి .. మంచి బట్టలు ధరించి పూజకు కావలసినవన్ని సిద్దం చేసుకోవాలి.

మహాలక్ష్మి పూజ లో ముందుగా కొబ్బరి కాయ చాల ముఖ్యం .. కొబ్బరి కాయ పవిత్రమైనది. భావంతుడికి ప్రీతి పాత్రం ఈ కొబ్బరి కాయ అందులోను ఏకాక్షి కొబ్బరి కాయ అంటే లక్ష్మి దేవి కి చాల ఇష్టం .. ఈ పూజలో ఏకాక్షి కొబ్బరి కాయ ను ఉపయోగిస్తారు. పూజ గది లో ఒ పళ్ళెం తీసుకోని అందున అమ్మవారి హృదయ కమలం అంటే అష్ట దళం ను గంధం కుంకుమలతో వెయ్యాలి .

ఆ తరువాత ఏకాక్షి కొబ్బరి కాయ ను కమలం పై ఉంచి . దీప దూపనైవేద్యాలు సమర్పించాలి ..అటు పై అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రని వస్త్రం తీసుకోని. దానిపై ఓం హ్రీం క్లీం యం మహాలక్ష్మి స్వరూపాయ ఏకాక్షి నారికేలాయ నమః .. మమ సంవృద్ది కురు కురు స్వాహా అంటూ రాయాలి. ఇప్పుడు ఏకాక్షి కొబ్బరి కాయ ను ఈ ఎర్రటి వస్త్రం పై వుంచి ఎర్రటి గులాబీలతో అమ్మ వారి మంత్రం చెబుతూ గులాబీ రేకులను ఒక్కొక్కటిగా కొబ్బరి కాయ పై వెయ్యాలి .

ఆ తరువాత గులాబీ రేకులను తొలగించి కొబ్బరి కాయను వస్త్రం తో చుట్టి ఉన్న కొబ్బరి కాయను బియ్యం నింపిన పాత్రపై ఉంచాలి.అటుపై మూలమంత్రం ఇలా జపించాలి ఓం హ్రీం శ్రీం క్లీం యం ఎకాక్షయ శ్రీ ఫలాయ భాగావతాయ , విశ్వరుపాయ , సర్వేశ్వరాయ త్రైలోక్య నాథాయ , స్వర్వాకార్య ప్రదాయ నమః అని ముగించాలి .. ఉపవాసం ఉండి చేస్తే మరి మంచిది.

మరుసటి రోజు అమ్మవారిని 21 ఎర్రటి గులబీలతో పూజ చేసి ఆ కొబ్బరి కాయను ఇంటి సింహద్వారానికి కట్టాలి. ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో సిరుల పంట పండుతుంది. ఎవరెవరైతే ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారో వారంతా ఈ పరిష్కారాన్ని పాటించి సత్ఫలితాలు పొందాలని భావిస్తున్నాం.

(Visited 1 times, 1 visits today)