Home / Uncategorized / రేవంత్ రెడ్డిని రాజకీయంగా అంతం చేయడానికి కేసీఆర్ ప్లాన్ ఇదేనంట.?

రేవంత్ రెడ్డిని రాజకీయంగా అంతం చేయడానికి కేసీఆర్ ప్లాన్ ఇదేనంట.?

Author:

రాజకీయ సన్యాసం చేస్తానన్న రేవంత్ రెడ్డిపై ఒక రేంజ్ లో ట్రోల్ల్స్ వస్తున్నాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రముఖులు సైతం ఓడిపోబోతున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన పై విధంగా సవాల్ విసిరారు.

source

ఈ విషయం రేవంత్ దాకా రావడంతో ఆయన స్పందించారు. ‘‘ తన సవాల్‌పై కేటీఆర్ స్పందించలేదని… ఆయన స్పందనపైనే నా నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు. తనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తన సొంత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని…ప్రజల కోసమే ఉన్నానని.. ప్రజలతోనే ఉంటానని రేవంత్ స్పష్టం చేశారు.

అయితే ఇంతటితో ఆగిపోకుండా రేవంత్ ను ఎలాగైనా రాజకీయంగా సమాధి చెయ్యాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారట. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పై గెలిచిన పట్నం నరేంద్రను తన క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందట. తెలంగాణాలో ప్రముఖ నేతైన పట్నం మహేంద్ర రెడ్డి సోదరుడు ఆయన. అయితే మహేందర్ రెడ్డి తాండూరు నుండి అనూహ్యంగా ఈ ఎన్నికలలో ఓడిపోయారు. తొలుత ఆయనను ఎమ్మెల్సీ గా చేసి క్యాబినెట్ లోకి తీసుకోవాలి అనుకున్నా ఇప్పుడు ఆయన స్థానంలో పట్నం నరేంద్రను క్యాబినెట్ లోకి తీసుకుంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారట.స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయితే వచ్చే ఎన్నికలలో కూడా ఆయనను గెలిపించే అవకాశం ఉంటుంది. అదే విధంగా వచ్చే ఐదు సంవత్సరాలలో కొడంగల్ లో అభివృద్ధి చేసి మళ్ళీ ఇక్కడ నుండి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే తమకు ఇబ్బంది అని ఆ నియోజకవర్గం ప్రజలతో అనిపించాలని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది.

(Visited 1 times, 1 visits today)