Home / Latest Alajadi / ప్రమాణశ్వీకారంలో కేసీఆర్ తీసుకోనున్న సంచలన నిర్ణయాలు ఇవే..! గతంలో అలా జరిగినందుకే!

ప్రమాణశ్వీకారంలో కేసీఆర్ తీసుకోనున్న సంచలన నిర్ణయాలు ఇవే..! గతంలో అలా జరిగినందుకే!

Author:

తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ రేపు (గురువారం) మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యెలతో టిఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈసమావేశంలో ఎమ్మెలంతా కెసిఆర్‌ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. తరువాత కెసిఆర్‌ గవర్నర్‌ ను కలిసి టిఆర్‌ఎస్‌ శాసనసభపక్ష సమావేశంలో చేసిన తీర్మానాన్ని సమారిపంచనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.30కు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది.

ఈ సమావేశం అనంతరం కేసీఆర్‌, పలువురు సీనియర్‌ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. కేసీఆర్‌తో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రమానసవీకరమ్ చేసిన తర్వాత గతంలో తనను విమర్శపాలు చేసిన కొన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా గత తెలంగాణ క్యాబినెట్ లో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈసారి తమ క్యాబినెట్లో ఉపముఖ్యమంత్రి లేదా హోమ్ శాఖ మంత్రి వంటి కీలక పదవులని ఇవ్వాలి అని అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే విద్యార్థి లోకం కూడా తన పై వ్యతిరేకంగా ఉంది అనే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ తాను గెలిస్తే ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అలాగే ఎక్కువ మంది దళితులకు పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది అని సమాచారం.

(Visited 1 times, 1 visits today)