Home / Latest Alajadi / కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ అదేనా.? చంద్రబాబు ఏమని కౌంటర్ ఇచ్చారో తెలుసా.?

కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ అదేనా.? చంద్రబాబు ఏమని కౌంటర్ ఇచ్చారో తెలుసా.?

Author:

కేసీఆర్‌ దూకుడు ముందు ప్రతిపక్షాలు కకావికలమైపోయాయి. కూటమి అంటూ నేతలు కలిసినా…ప్రజలు మాత్రం కలవలేదు. చివరికి కూటమికి ఓటమి తప్పలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి విజయభేరి మోగించింది. భారీ మెజారిటీతో తమకు తిరుగులేదని చాటింది. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. 2014 ఎన్నికల్లో కంటే అత్యధిక స్థానాలను గెలుచుకుంది టీఆరెస్.

ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా తో మాట్లాడిన కేసీఆర్ చంద్రబాబు మీద పంచ్ డైలాగులు వేసాడు. తెలంగాణాలో మామీద ఇంత కుట్ర చేసిన బాబు ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడ్డం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. తెలంగాణ పాలిటిక్స్ లో ఎపి సీఎం వేలుపెట్టడాన్ని టీఆర్ఎస్ ముందు నుంచి తప్పు పడుతూ వచ్చింది. చంద్రబాబు కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే తెలంగాణ వారికి సంస్కారం లేదంటారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు కేసీఆర్.

ఇప్పుడు కేసీఆర్ మాటలపై ఒకొక్కరు ఒకోలా అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఓటుకు నోటు కేసును మళ్ళీ బయటకి తీసి బాబు కి గిఫ్ట్ ఇచ్చేందుకు కేసీఆర్ సిద్దమవ్వబోతున్నాడు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా.. రాజకీయంగా … చంద్రబాబు కి విరోధులుగా ఉన్న జనసేన, వైసీపీ అధినేతలు పవన్ జగన్ లకు రాజకీయంగా అండదండలు అందించి ఏపీలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు కూడా అర్ధం అవుతోంది.

సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కామెంట్స్‌పై చంద్రబాబు స్పందించారు. విద్వేషాలకు టీడీపీ దూరంగా ఉంటుందని, ఆయన రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీని స్థాపించారని చంద్రబాబు గుర్తుచేశారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాకు ఇయ్యాల లక్ష ఫోన్లు వచ్చినై. అక్కడ కట్టలక్కట్టల మెసేజ్‌లు ఉన్నాయ్‌. వాట్సాప్‌ ఎస్సెమ్మె్‌సలు వస్తున్నయ్‌. మా వాళ్ల ఫోన్లు పగిలిపోయే పరిస్థితి ఉంది. నేను జోక్‌ చేస్తలేను. నిజాయితిగా చెబుతున్నా. మీరు ఏపీ రాజకీయాల్లో కలుగచేసుకోవాలె అని అడుగుతున్నారు. ఎస్‌.. వంద శాతం దేశ రాజకీయాలను బాగు చేసే క్రమంలో ఏపీ రాజకీయాల్లోనూ కలుగజేసుకుంటాం. తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే.. మనం కూడా కలిసి పనిచేయాలి. అది చేస్తం కూడా. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు వచ్చి ఇక్కడ పని చేశారు. మేం పోయి అక్కడ పనిచేయొద్దా? ఇప్పుడు మనం బర్త్‌డే పార్టీ చేస్తం.. మనం తిరిగి గిఫ్ట్‌ ఇస్తమా లేదా? ఇయ్యకపోతె మనది తప్పయితది మరి. చంద్రబాబు నాకు గిఫ్టు ఇచ్చారు. నేను రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి కదా’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

(Visited 1 times, 13 visits today)