Home / Inspiring Stories / నిర్భయ తరహాలో… మరో దారుణ ఘటన.

నిర్భయ తరహాలో… మరో దారుణ ఘటన.

Author:

దాదాపు ఇప్పటికే ఐదు రోజులు దాటిపోతుంది ,గురువారం సాయంత్రం కేరళలోని కొచ్చి సమీపంలో ఆమె సొంత నివాసం వద్దనే ఓ 29 ఏళ్ల మహిళ ను అతి క్రూరంగా రేప్ చేసి చంపిన నిందితులను పట్టుకోవటంలో పోలీసులు విఫలమయ్యారు .ఆమె తల్లి పని మీద వెళ్లి తిరిగి వస్తుండగా ,ఇంటికి దగ్గరలోనే ఓ కొలనులో తీవ్ర రక్తస్రావంతో తన బిడ్డ శవమై కనపడింది ,ఆమె శవ పరీక్షల ద్వారా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆమె రేప్ కి ముందు ఆ తర్వాత విపరీతంగా కొట్టబడీ మరియూ ఓ పదునైనా కత్తిలాంటి ఆయుధంతో ఆమె పొట్ట పై బాగాన్ని కోసి జీర్ణాశయంలో ఒక ప్రేగును సైతం ఆ దుర్మార్గుడు బయటకు లాగాడు ,అంతే కాదు ఆమె శరీరం పై ఇంకా 30 పైననే గాయాలు ఉన్నాయి .

kerala-law-student-murder

ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు గురువారం ఈ మహిళ ఒక్కటే ఇంట్లో ఉంది ,అయితే ఆ దుర్మార్గుడు మర్డర్ తర్వాత రేప్ చేసాడా? రేప్ చేసి చంపెసాడా ? అన్న విషయాలు మాత్రం పోస్ట్ మొర్తెం రిపోర్ట్ల తర్వాతనే లభ్యమవుతాయ్ , ప్రస్తుతం శెవ పరీక్షల ద్వారా లభ్యమైన వివరాల ప్రకారం ఆమె మెడ ,ఛాతి,పొట్ట మరియూ తలపై ఉన్నట్టు గుర్తించారు ..

దోషులని పట్టుకోవటంలో ఆలస్యం చూపిస్తున్న పోలీసుల నిర్లక్ష్యాన్ని స్థానికులు ,మిత్రులూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ,సామాజిక మాధ్యమాలు కూడా ఈ అమ్మాయికి అండగా నిలబడుతున్నాయి. ఈ దుర్ఘటన ఇటీవల ఢిల్లీ అతిక్రూరంగా చంపబడ్డ నిర్భయ ఘటనతో పోలి ఉండటంతో ఈ విషయం పైన కూడా ,ఫేస్బుక్ వంటి సైట్లలో పోలీసుల నిర్లక్ష్యం పై దుమ్మెత్తి పోస్తున్నారు,స్థానిక రాజకీయ పార్టీ నాయకులు కూడా నిందితులని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించవలసిందిగా పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఈ విషయంలో ఆమె కుటుంబసభ్యులు మరియూ మిత్రులకి బాసటగా ఉన్నారు.

kerala-law-student-murder

ప్రభుత్వం ఎన్ని రకాల కొత్త చట్టాలు శిక్షలు ప్రవేశపెట్టినా ఇలాంటివి ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయంటే ఆలోచించాల్సిన విషయమే కదూ ,ప్రభుత్వం శిక్షలు ఇంకా కఠినతరం చేసి, బడి వయసు నుంచే పిల్లలుకు నైతిక విలువలు,సామాజిక బాద్యతల గురించి నేర్పించుకుంటే ,ఇలాంటి దుర్ఘటనలు తగ్గించుకోవచ్చేమో.

Must Read: మన దేశంలో న్యాయం అంటే ఏమిటి..?

(Visited 1,717 times, 1 visits today)