Home / Videos / KFC చికెన్ తింటున్నారా..! కెఎఫ్‌సి చికెన్ తో ప్రాణాలకే ప్రమాదం.

KFC చికెన్ తింటున్నారా..! కెఎఫ్‌సి చికెన్ తో ప్రాణాలకే ప్రమాదం.

Author:

మన ఇంటికి ఎవరైనా అధితులు వస్తే మనం వెంటనే చికెన్ ని చకచక వండేస్తాం, ఏదైనా చిన్న పార్టీ అయిన, వీకెండ్ అయిన ఖచ్చితంగా చికెన్ ఉండాల్సిందే, కాని ఈ ఆధునిక జీవితానికి అలవాటు పడ్డ మనం ఇంట్లో తినడం మానేసి ఫాస్ట్ ఫుడ్ కి బాగా అలవాటు పడ్డం, ఇప్పుడు వారానికి ఒక్క సారైనా కెఎఫ్‌సి చికెన్ తినాల్సిందే అన్నట్టుగా తయారైంది చాలా మంది పరిస్థితి, పిల్లలకి అయితే రెండు రోజులోకసారి కెఎఫ్‌సి చికెన్ కావాల్సిందే.

KFC Chicken 1

కెఎఫ్‌సి చికెన్ అంటే చాలు ఎగిరిగంతేసి లెగ్ పీసుల మీద లెగ్ పీసులు లాగించేస్తారు, కాని లెగ్ పీసులే మన పాలిట శాపంగా మారాయి, కెఎఫ్‌సి లో చికెన్ తినడం అంటే కొత్త కొత్త రోగాలని కొని తెచ్చుకోవడమే అని అంటున్నారు వైద్యులు, కెఎఫ్‌సి హోటల్స్ లో ఉపయోగించే చికెన్ అమెరికాలోని కేంటరి అనే ప్రాంతంలో తయారుచేస్తారు, అక్కడి నుండే 118 దేశాలకి చికెన్ ని సరఫరా చేస్తారు, కెఎఫ్‌సి చికెన్ ని ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వివిధ రకాల కెమికల్స్ ని వాడుతున్నట్టు గుర్తించారు, చికెన్ ని ప్రాసెసింగ్ చేసే సమయంలో నిషేదిత కెమికల్స్ ని ఉపయోగిస్తున్నట్టు తెలిసింది, మెనోసోడియం గ్లుటమేట్ ని కెఎఫ్‌సి చికెన్ లో అధిక మొత్తంలో వాడటం వల్ల అది విష పదార్థం లాగా తయారు అవుతుందని వైద్యులు తెలిపారు, దానితో పాటు ఈకోలి , సాల్మొనెల్లా అనే అంత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉన్నట్టు సికింద్రాబాద్ లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్ కి చెందిన వైద్యులు నిర్దారించారు.

కెఎఫ్‌సి చికెన్ లో ఉండే బ్యాక్టీరియా చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని పిల్లలు పూర్తిగా నీరసించిపోతారని, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని గుర్తించారు, కళ్ళు, మెదడు పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఇంత ప్రమాదకరమైన చికెన్ ని కెఎఫ్‌సి అమెరికా లో ఎలా అమ్మగలుగుతుందని అందరిలో మెదిలే ప్రశ్న..? కాని ఇక్కడే అసలు విషయం ఉంది, అమెరికాతో పాటు మరి కొన్ని దేశాలలో కెఎఫ్‌సి చికెన్ లో చాతీ భాగాన్ని మాత్రమే తింటారు, లెగ్ పీసులని తినరు, ఎందుకంటే కోళ్ళు త్వరగా ఎదగాలని వివిధ రకాల ఇంజక్షన్ లని కోడి కాళ్ళకి ఇస్తారు అందుకే వారు లెగ్ పీసులని తినరు, అలాంటి లెగ్ పీసులని మన లాంటి దేశాలకి ఎగుమతి చేస్తారు.

అలా విషపూరితమైన చికెన్ పీసులని అదిరిపోయే టేస్ట్ తో మనకి అందిస్తుంది కెఎఫ్‌సి, కావున ఇలాంటి చికెన్ ని తిని ప్రాణాల పైకి తెచ్చుకునే బదులు,ఇంట్లో ఆమ్లెట్ వేసుకుని తినడం మేలు.

(Visited 4,124 times, 1 visits today)