Home / Reviews / ఖైదీ నంబర్ 150 సినిమా రివ్యూ & రేటింగ్.

ఖైదీ నంబర్ 150 సినిమా రివ్యూ & రేటింగ్.

Alajadi Rating

3.25/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా, ఆలీ,బ్రహ్మానందం తదితరులు

Directed by: వి. వి. వినాయక్

Produced by: రామ్ చరణ్

Banner: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ

Music Composed by: దేవి శ్రీ ప్రసాద్

2007 లో శంకర్ దాదా జిందాబాద్ సినిమాతో ఆగిన మెగాస్టార్ సినీ ప్రస్థానం మరల 10 సంవత్సరాల తరువాత 2017 లో మొదలవబోతుంది. తెలుగు సినిమా రంగానికి ఎన్నో మెగా హిట్లు అందించి కోట్ల మంది సినీ అభిమానుల అభిమానాన్ని చూరగొన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో విజయ్ నటించిన సూపర్ హిట్ సినిమా “కత్తి” కధను వి.వి. వినాయక్  దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తరపున రామ్ చరణ్ నిర్మాతగా ఖైదీ నంబర్ 150 ని నిర్మించారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రచారం జరిగిన ఖైదీ నంబర్ 150 సినిమా ఎలా ఉందో చదివేయండి.

కథ:

చిన్నప్పటి నుండి దొంగతనాలు చేస్తూ పెరిగిన కత్తి శ్రీను కలకత్తా జైలు నుండి పారిపోయి హైదరాబాద్ కి వస్తాడు, పోలిసుల నుండి తప్పించుకోవడానికి బ్యాంకాక్ కి వెళ్లే ప్రయత్నంలో లక్ష్మి (కాజల్) ని చూసి ప్రేమలో పడిపోతాడు, లక్ష్మి వెంట పడే క్రమంలో అచ్చం తనలాగే ఉండే శంకర్ అనే నాయకుడి స్థానంలోకి వెళ్తాడు..! ఈ శంకర్ ఎవరు..? శంకర్ దేనికోసం పోరాడుతున్నాడు..? ఆ ఉద్యమాన్ని కత్తి శ్రీను గెలిపించాడా..? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

దాదాపు పదేళ్ల తరువాత మెగాస్టార్ మళ్ళీ తెర మీదకి వస్తుండటంతో మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు, అభిమానుల అంచనాలకి తగ్గట్లుగానే ఖైదీ నెం.150 లో మాస్ ఎలిమెంట్స్, డాన్స్ లు, కామెడీ సీన్లు ఉన్నాయి, ఇవన్నీ మెగా అభిమానులని విశేషంగా అలరిస్తాయి.

ఫస్ట్ ఆఫ్ లో ఇంటర్వెల్ కంటే పావుగంట ముందునుండే అసలు కథ మొదలవుతుంది, అప్పటివరకు చిరంజీవికి, బ్రహ్మానందానికి మధ్యలో కామెడీ సీన్లు, హీరోయిన్ కాజల్ తో రొమాన్స్ మాత్రమే ఉంటాయి, ఇంటర్వెల్ ఫైట్ కంటే ముందే వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.

సెకండ్ ఆఫ్ నుండి అసలు సినిమా మొదలవుతుంది, చిరంజీవి చెప్పే డైలాగ్స్ అదిరిపోతాయి, హీరో-విలన్ పోరు కంటే కూడా.. హీరో సమస్య మీద పోరాడే తీరు ఆకట్టుకుంటుంది. ప్రి క్లైమాక్సులో వచ్చే ‘వాటర్’ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

ఇలాంటి సీరియస్ సినిమాలో పాటలని కథ మధ్యలో పెట్టడం కథ గమనానికి అడ్డంగా మారుతాయి, సెకండ్ ఆఫ్ లో వాటర్ ఎపిసోడ్ సీరియస్ గా సాగిపోతుంటే మధ్యలో ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాట వస్తుంది, అభిమానుల కోసం పాట ఉండాలి కానీ పాట కోసం సినిమానే ఆగిపోకూడదు.

నటీనటుల పనితీరు:

చిరంజీవి: చేయననుకున్నరా? చేయలేననుకున్నారా? అన్న రేంజ్ లో చిరంజీవి తనకిచ్చిన రెండు పాత్రల్లో ఒదిగిపోయారు. తొమ్మిదేళ్ళ గ్యాపులో ఉన్న కసినంతా ఈ సినిమాతో తీర్చుకున్నారు. శంకర్ పాత్ర కన్నా కత్తి శ్రీను పాత్రలో చిరు చాలా ఈజ్ గా నటించారు. చిరు డ్యాన్సుల్లో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు.

కాజల్: లక్ష్మి గా కాజల్ కి పెద్దగా నటించాల్సిన అవసరం రాలేదు. చిరంజీవి సరసన అందంగానే కనపడిన కాజల్ డ్యాన్సుల్లో తన సత్తా ఎంటో చూపించింది. అంతకుమించి కాజల్ కి ఈ సినిమాలో డైలాగులు లేవు.

చిరంజీవికి వెంటగా అలీ సినిమా మొత్తం కనపడుతాడు కాని ఇద్దరి మధ్య నవ్వించే సంధర్భాలు కొన్నే ఉన్నాయి. పోసాని, బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విలన్ గా తరుణ్ అరోరా నటన బాగానే ఉన్నా ఇంకొంచం పవర్ఫుల్ గా చూపిస్తే బాగుండేది.

ప్లస్ పాయింట్స్:

  • కథ
  • చిరంజీవి నటన
  • దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్
  • కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్ :

  • స్క్రీన్ ప్లే
  • విలన్
(Visited 4,209 times, 1 visits today)