Home / Videos / ఖైదీ నెంబర్ 150 టీజర్ వచ్చేసింది..!

ఖైదీ నెంబర్ 150 టీజర్ వచ్చేసింది..!

Author:

ఎన్నో రోజుల నుండి ఊరిస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమా టీజర్ వచ్చేసింది, కొన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత మెగా స్టార్ నటిస్తున్న సినిమా కావడంతో లుక్స్ మెగా అభిమానులలో అంచనాలు పీక్స్ కి వెళ్లిపోయాయి, ఫస్ట్ లుక్ లో చిరంజీవి గారి లుక్ ని చూసి ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చిన కూడా మెగా స్టార్ మాత్రమే ఉండే ప్రత్యేకమైన గ్రేస్, చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు.

మాంచి మాస్ క్యారెక్టర్ పడితే చిరంజీవి ఎలా రెచ్చిపోతాడో అనేలా ఈరోజు విడుదల చేసిన టీజర్ లో ఉంది, ఇప్పటికే ఉన్న అంచనాలు ఈ టీజర్ తో ఇంకా ఎక్కువైపోతాయి, రేపు రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమా రిలీజ్ ఉండగా, ఈరోజు ఖైదీ నెంబర్ 150 టీజర్ కూడా విడుదల చేయడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

(Visited 830 times, 1 visits today)