Home / Devotional / పరమ పవిత్రమైన గంగా నది అద్భుత శక్తి గురించి తెలుసుకుంటున్న శాస్త్రవేత్తలు.

పరమ పవిత్రమైన గంగా నది అద్భుత శక్తి గురించి తెలుసుకుంటున్న శాస్త్రవేత్తలు.

Author:

పురాణాల నుండి ఇతిహాసాల వరకు … భారతీయ ఆధ్యాత్మిక గ్రంధాలనుండి ఇప్పటి వరకు మనకు వినిపించే మాట గంగా నది స్వచ్ఛమైనది, పవిత్రమైనది అని. గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తే అన్ని వ్యాధులు నశించి, శుభాలు కలుగుతాయని చెబుతుంటారు మన పెద్దవారు. భారతీయ హైదవ దర్మం ప్రకారం చనిపోయినవారి అస్థికలు గంగలో కలిపితే వారికి మోక్ష ప్రసాదం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. కొన్ని లక్షల టన్నుల చెత్త కలిసిన కూడా గంగలో పవిత్రత ఎలా ఉంది, కలుషితం కాకుండా ఎలా ఉండగలుగుతుందో అని చంఢీగర్ కు చెందిన మైక్రోబయాలజిస్టులు గంగా నది పవిత్రతపై పరిశోధనలు జరుపుతున్నారు.

ganga-river

వీరు జరుపుతున్న పరిశోదనలో గంగా నది నీళ్లలో రకరకాల బ్యాక్టీరియాలను నిర్ములించే బ్యాకిట్రయోఫేజ్ కు చెందిన పలు వైరసులు పుష్కలంగా ఉన్నట్టు కనుగొన్నారు. ఈ వైరసులు హానికరమైన బ్యాక్టీరియాలను హరించడం ద్వారా గంగా నది నీళ్లు మురిగిపోకుండా అలాగే చెడిపోకుండా ఉంచుతున్నట్లు గుర్తించారు. గంగా నదిలో ఉన్న ఈ వైరస్ అత్యంత శక్తివంతమైన యాంటీ బయాటిక్ మందులకు లొంగని ఇన్ఫెక్షన్లను సైతం అడ్డుకోగలవని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే ఈ వైరస్ లలో 20-25 వరకు అత్యంత శక్తి కారాకాలను పలు వ్యాధులకు విరుగుడుగా ఉపయోగిచవచ్చు అని తెలిపారు. ఈ పరిశోధన పూర్తీ వివారాలు ఈ సంవత్సరం చివరికి ప్రభుత్వానికి అందజేయనున్నారు.

(Visited 6,072 times, 1 visits today)