Home / health / మీరు రోజు ఈ నాలుగు విష పదార్ధాలు తింటున్నారా?

మీరు రోజు ఈ నాలుగు విష పదార్ధాలు తింటున్నారా?

Author:

పాత రోజులలో మన పెద్దవారు ఇప్పుడున్న సౌకర్యాలేవి అందుబాటులో లేకున్నా ఎటువంటి వ్యాధుల భారిన పడకుండా అంత బలంగా ఎందుకుండేవారో ఎప్పుడైనా అలోచించారా? దానికి కారణం అప్పటి వాతావరణం మరియు వారు ఆ రోజులలో తీసుకున్న కలుషితం కాని ఆహారమే. పెరుగుతున్న సాంకేతికతతో పాటు మన ఆహారం కూడా కలుషితం అవుతూ వచ్చింది. ఈ రోజుల్లో మనకు తెలిసే మనం విషతుల్యమైన ఆహరం తీసుకుంటున్నాం, నమ్మడం లేదా? ఐతే మనం రోజు ఉపయోగిస్తున్న ఈ విష పదార్ధాల గురించి చదవండి.

processed food items

శుద్ధిచేసిన ఉప్పు(టేబుల్ సాల్ట్) :

భారతీయ వంటకాలలో స్వీట్స్ మినహా ప్రతి వంటకంలో ఉప్పు తప్పని సరిగా వాడుతాం. ఈ రోజుల్లో మార్కెట్ లో దొరికే అన్ని బ్రాండ్ల ఉప్పుని అధిక ఉష్ణోగ్రత వద్ద తయారు చేస్తారు. ఇలా శుద్ధిచేసిన ఉప్పులో సహజసిద్ధమైన సోడియం లోపించడం వల్ల ఊపిరితిత్తులలో సమస్యలు ఏర్పడతాయి. సహజసిద్ధమైన సోడియం మనం పీల్చిన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇలా శుద్ధిచేసిన ఉప్పు నీటిలో పూర్తిగా కరగకుండా యూరిక్ యాసిడ్ పెంచుతుంది. దీనికి ప్రత్యామ్న్యాయంగా రాక్ సాల్ట్ ని వాడోచ్చు. ఈ రాళ్ళ ఉప్పు నీటిలో పూర్తిగా కరిగిపోవడం వలన దీనిని శరీరంలోని ఎంజైమ్స్ మరింతగా వినియోగించుకోగలుగుతాయి.

పాశ్చ్యురైజ్డ్ పాలు:

పాలను ఎక్కువ రోజులు నిలువ చేయాలన్న ఉద్యేశ్యంతో పాశ్చరైజేషన్ ప్రక్రియ మొదలయ్యింది కాని పాశ్చరైజేషన్ ప్రక్రియ పాలలో సహజంగా ఉండే ఎంజైములు, విటమిన్ A, B12 మరియు C లను తొలగించి పాల నిలువను పెంచే హార్మోన్లు మరియు యాంటీబయాటిక్స్ ని కలుపుతుంది, అంతే కాకుండా శరీరానికి అవసరమైన కాల్షియంను శోషించే అతిముఖ్యమైన ఎంజైములు నాశనం చేస్తుంది, కాల్షియం పిల్లల పెరుగుదల, ఆరోగ్యానికి మరియు రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధిలో కీలకం. దీనికి ప్రత్యామ్న్యాయంగా మీ దగ్గరలోని రైతుల వద్ద తాజా పాలు తీసుకుని వాడితే మంచిది.

మెరుగుపెట్టిన బియ్యం (పాలీష్డ్ రైస్):

మన ఆహరంలో కచ్చితంగా రెండు పూటలు అన్నం ఉంటుంది. మరి ఆ అన్నాన్ని తయారు చేసే సన్న బియ్యం మన శరీరానికి హాని తలపెడుతోండి. సన్న బియ్యం మోజులో వడ్లను బాగా మెరుగు(పాలిష్) చేయడం వలన బియ్యం నుండి బాహ్య పొర మరియు బీజ పొరలు తొలగి పోయి కేవలం ఎండోస్పెర్మ్ పొర మాత్రమే మిగిలి ఉంటుంది. పోషకాలు అన్ని కోల్పోయిన ఆ పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల దేహంలో మధుమేహం.. హైబీపీ పెరుగుతున్నాయంటున్నారు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ణీణ్) శాస్త్రవేత్తలు. వీటికి ప్రత్యామ్న్యాయంగా పాలిష్ చేయనివి లేదా తక్కువగా చేసినవి, దంపుడు బియ్యం లేదా ముడి బియ్యం వాడడం ఆరోగ్యానికి మంచిది.

శుద్ధిచేసిన చక్కెర:

అప్పట్లో చెరుకు రసంను గడ్డకట్టేంత వరకూ కాచి, దాన్ని ఒక మోస్తరు రాళ్ళుగా విడగొట్టి చక్కెర తయారు చేసేవారు. కానీ ఈరోజు రసాయన ప్రక్రియలకు గురి చేసి, శుద్ధి చేసి చక్కెరని తయారు చేస్తున్నారు. అలాంటి శుద్ధి చేయబడిన చక్కెర కేవలం “ఖాళీ క్యాలరీలను” అందిస్తుంది. ఎందుకంటే శుద్దీకరణ ప్రక్రియ దాదాపు అన్ని విటమిన్లని, ఖనిజాలని తొలగించి, చక్కెర పోషక విలువలను నాశనం చేస్తుంది. ఇలా తయారు చేసిన చక్కెర ని అధిక మోతాదులో స్వీకరిస్తే దంత క్షయం, రక్తనాళాలు గట్టిపడటం మరియు పోషక లోపాలు కలుగుతాయి. చెక్కర కు ప్రత్యామ్న్యాయంగా బెల్లం ,తేనె లను వాడటం మంచిది. గోరువెచ్చని నీటితో కలిపి ప్రతీరోజూ తీసుకుంటే, తేనె రక్తప్రసార వ్యవస్థలోని ఎర్ర రక్త కణాల సంఖ్యను, రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

(Visited 4,453 times, 1 visits today)