Home / Inspiring Stories / ఈ ఆసుపత్రిలో ఏ ఆపరేషన్ అయిన ఉచితమే, ప్రపంచ స్థాయి వైద్యులు చికిత్స చేస్తారు..!

ఈ ఆసుపత్రిలో ఏ ఆపరేషన్ అయిన ఉచితమే, ప్రపంచ స్థాయి వైద్యులు చికిత్స చేస్తారు..!

Author:

ఇప్పుడున్న పరిస్థితులలో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చిన వేల రూపాయలని ఆసుపత్రులలో కట్టాల్సి వస్తుంది, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటూ సామాన్య ప్రజల దగ్గర డబ్బులని దోచుకుంటున్నారు, గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలని నయం చేయించుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే, కానీ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉన్న సత్యసాయి స్పెషాలిటీ ఆసుపత్రిలో అయితే ఎటువంటి అనారోగ్య సమస్యని అయిన ఉచితంగా నయం చేస్తారు. ఇక్కడ లక్షలు విలువ చేసే గుండె ఆపరేషన్ అయిన, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అయిన ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే నయం చేస్తారు.

puttaparthi-hospital-satyasai

ఈ ఆసుపత్రిని పుట్టపర్తి సాయిబాబా కట్టించారు, అత్యాధునిక సదుపాయాలతో 1991 లో కట్టించి అప్పటి ప్రధాని పి.వి నరసింహారావు గారి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభింపచేసారు, ఇక్కడ అత్త్యుత్తమ వైద్యుల ఆధ్వర్యంలో అన్ని రకాల వైద్య చికిత్సలని ఉచితంగా అందచేస్తారు, ఇక్కడ చికిత్స చేయించుకోవడానికి దేశ విదేశాల నుండి రోగులు వస్తుంటారు, పేద, ధనిక లాంటి భేదాలు లేకుండా అందరికి ఒకేరకమైన సౌకర్యాలని కల్పిస్తూ చికిత్స చేస్తారు.

ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలంటే ఉదయం 6గంటల నుండి ఇచ్చే టోకెన్ ని తీసుకోవాల్సి ఉంటుంది, ఆ టోకెన్ కోసం ఉదయం 4 గంటల నుండే క్యూలో నిల్చుంటారు, టోకెన్స్ తీసుకున్నవారిని లోపాలకి తీసుకెళ్లి వారి అనారోగ్యాన్ని బట్టి అవసరమైన వైద్యాన్ని అందిస్తారు, ఇతరులకి సహాయం చేసినవాడే దేవుడు కాబట్టి ఇంత మంది జీవితంలో వెలుగులు నింపుతున్న సత్య సాయిబాబా నిజంగా దేవుడే.

satya-sai-hospital

సత్యసాయి హాస్పిటల్ లో అందించే వైద్య సేవలు:

  • గుండె సంబంధిత వ్యాధులు.
  • మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు.
  • ఫ్లాస్టిక్ సర్జరీ.
  • కంటిచూపుకు.
  • ఆర్థ్రోపెడిక్.
  • గ్యాస్ట్రోఎంటరాలజీ( ఎండోస్కొపి)

పేదల వైద్యం కోసం పుట్టపర్తి సాయిబాబా …స్థాపించిన ఇతర సంస్థలు:

  • పుట్టపర్తిలోని Sri Sathya Sai Institute of Higher Medical Sciences 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
  • బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇనస్టిట్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 333 పడకల ఆసుపత్రి.
  • అలాగే బెంగళూరు వైట్‌ఫీల్డ్ల్‌లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్
  • ఇంకా ఎన్నో వైద్యశాలలు గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి.

వీటితో పాటు ఎల్లప్పుడూ కరువు, అనావృష్టితో ఉండే అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టులు నిర్మించారు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు అనేక దేశాలలో పాఠశాలలని నిర్వహిస్తున్నారు, ఇలా అనేక కార్యక్రమాలని ప్రజల కోసం నిర్వహింస్తుండంటం చాలా గొప్ప విషయం.

Must Read: తెలంగాణా & ఆంధ్రప్రదేశ్ లో మీయొక్క భూమి వివరాలు సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?

(Visited 8,429 times, 1 visits today)