Home / Inspiring Stories / వరల్డ్ ఛాంపియన్ ని చంపేసిన ప్రభుత్వం.

వరల్డ్ ఛాంపియన్ ని చంపేసిన ప్రభుత్వం.

Author:

బుధియా అనే పేరు పదేళ్ల క్రితం ఒక సంచలనం ఇప్పుడు మాత్రం ఈ పేరు ఎవరికీ తెలియదు, నాలుగేళ్ళ వయసులోనే 65 కిలోమీటర్లు పరుగెత్తి ప్రంపంచంలోనే అతి చిన్న వయసులో మారథాన్ రన్నింగ్ చేసిన బుడతడిగా రికార్డులని సృష్టించాడు, పెద్దయ్యాక మన దేశానికి మారథాన్ రన్నింగ్ లో ఒలంపిక్ పతకం ఖచ్చితంగా తీసుకొస్తాడని అందరు భావించారు, కానీ ఇప్పుడు బుధియా గురుంచి అందరు మరిచిపోయారు, ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్ అవుతాడు అనుకున్న బుదియా ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

Budhia-Singh-Biranchi-Das

2002 లో అంత్యంత పేద కుటుంబంలో బుధియా సింగ్ జన్మించాడు, పుట్టిన కొన్ని రోజులకే బుధియా తండ్రి చనిపోయాడు, కొడుకుని పోషించలేని తల్లి బుధియా 800 రూపాయలకి అమ్మేసింది, బుధియాని కొనుక్కున్న వారు సరిగా చూసుకోవట్లేరని బుధియా తల్లి బిరంచి దాస్ అనే వ్యక్తి సహాయంతో వారికి 800 ఇచ్చి తిరిగి తీసుకుంది, జూడో కోచ్ అయిన బిరంచి అనాధ పిల్లలని పెంచుకుంటుంటాడు, బుధియాని కూడా చేరదీశాడు.

Budhia-Singh-Biranchi-Das

ఒకరోజు బుధియా ఏదో తప్పు చేసినందుకు గ్రౌండ్ చుట్టూ పరిగెత్తమన్నాడు, బుధియా గ్రౌండ్ చుట్టూ పరుగులు తీస్తూనే ఉన్నాడు, ఒక 5 గంటల తరువాత బిరంచికి గుర్తుకొచ్చి గ్రౌండ్ కి వచ్చి చుస్తే బుధియా ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు, మూడేళ్ళ పిల్లాడు, ఆగకుండా 5 గంటలు పరుగెత్తడం బిరంచికి ఆశ్చర్యం కలిగించింది. వెంటనే బుధియాని ఆస్పత్రికి తీసుకెళ్ళి పరీక్ష చేయించాడు. అతని గుండె బాగానే ఉంది. బుదియా గుండె దమ్ము చూసిన బిరంచి అప్పటి నుండి అతనికి రన్నింగ్ లో శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టాడు, అలా నాలుగేళ్ళ వయసులోనే బుధియా పూరి నుండి భువనేశ్వర్ కి 65 కిలోమీటర్లు పరుగెత్తి లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ కి ఎక్కి ప్రంపంచ దృష్టిని ఆకర్షించాడు, ఆ తరువాత దేశ విదేశాలలో దాదాపు 48 మారథాన్ లలో పరుగెత్తి భవిష్యత్ లో అతి చిన్న వయసులోనే మారథాన్ చాంపియన్ అవుతాడు అని అందరు భావించారు కానీ అలా కాలేకపోయాడు ఎందుకంటే…?

Budhia-Singh-Biranchi-Das

కొంతమంది అంత చిన్న పిల్లాడిని ఎలా పరిగెత్తిస్తారు అని, కోచ్ బిరంచి దాస్ బుధియాని శారీరకంగా హింసిస్తున్నాడని ఇది బాలల హక్కుల ఉల్లంఘనే అని వాదించి కోర్ట్ లో కేసు వేశారు, బుధియా ఇక పరిగెత్తకూడదు అని కోర్ట్ ఆదేశించింది, బుధియాకి వచ్చిన డబ్బులతో బిరంచి అనాథ పిల్లలకి సహాయం చేసేవాడు, ఇది తట్టుకోలేక బుధియా తల్లి బుధియా ను కోచ్ విరించి హింసిస్తున్నాడని ఆరోపణలు చేసింది. పోలీసులు విరించిని అరెస్ట్ చేసారు. ప్రభుత్వం బుధియా ను విరించి దగ్గర నుండి తీసుకుని స్పోర్ట్స్ హాస్టల్ లో ఉంచింది.ఓ యువతిని రౌడీల నుండి రక్షించే ప్రయత్నం లో విరించి తన ప్రాణాలు కోల్పోయాడు. ఓ పేరు మోసిన నేరస్తుడు రాజ ఆచార్య, లెస్లీ త్రిపాఠి అనే మోడల్ ను వేధిస్తుంటే బిరంచి అడ్డుకున్నాడు. ఆ కోపం తో బిరంచిని, 2008, ఏప్రిల్ 13 న కాల్చిచంపారు.

Budhia-Singh-Biranchi-Das

బిరంచి చనిపోయాక బుధియాని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు, ప్రభుత్వం మొక్కుబడిగా ఒక స్పోర్ట్ స్కూల్ లో బుధియాని చేర్పించి వదిలేసింది, ఇప్పుడు బుధియా పరుగెత్తడమే మరిచిపోయాడు, ఇప్పుడు బుదియాకి 14 ఏళ్ళు, నాలుగేళ్ళ వయసులోనే 65 కిలోమీటర్లు పరుగెత్తిన బుధియా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మాములు పిల్లవాడిగా అయిపోయాడు, కనీసం జిల్లా స్థాయి టోర్నమెంట్ లలో కూడా సరిగా పాల్గొనలేకపోతున్నాడు. ప్రభుత్వం నియమించిన కోచ్ ను బుధియా గురించి అడిగితే, “ బుధియా మారథాన్ పరుగెత్తడమా, తను ఇంకా చిన్న పిల్లాడు అండి, 600 మీటర్లు కూడా పరుగెత్తలేడు” అని గర్వంగా(?) సమాధానం చెబుతాడు.

Budhia-Singh-Biranchi-Das

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రపంచ ఛాంపియన్ కావాల్సిన బుధియా ఇప్పుడు 600 మీటర్లు కూడా పరిగెత్తలేకపోతున్నాడు, చిన్న వయసులో పరుగెత్తకూడదు అని చెప్పిన వారు ఇప్పుడు ఒలంపిక్స్ లో పతకం గెలిచినా పీవీ సింధు కూడా చిన్న వయసులోనే బాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టింది, సింధు నే కాదు సచిన్ అయిన,ధోని అయిన ప్రపంచంలో స్పోర్ట్స్ లో ఛాంపియన్స్ అయిన ఎవరైనా బాల్యం నుండే ఆడటం వల్ల గొప్ప గొప్ప ఆటగాళ్లు అయ్యారు అని తెలుసుకోవాలి, ఒడిషా ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి బుధియాలో ఉన్న ఛాంపియన్ ని చంపేశాయి, కనీసం ఇప్పుడైనా ఒడిషా ప్రభుత్వం కళ్ళు తెరిచి బుధియాకి సరైన కోచింగ్ ఇప్పించి ఛాంపియన్ గా అయ్యేటట్టుగా చేయాలి.

Source: Korada

Must Read: పతకం కోసం పరిగెడితే, మన అధికారులు చావుని పరిచయం చేశారు.

(Visited 1,960 times, 1 visits today)