Home / Inspiring Stories / శివపార్వతుల వివాహం జరిగింది ఇక్కడే !, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలే ఉండవు.

శివపార్వతుల వివాహం జరిగింది ఇక్కడే !, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలే ఉండవు.

Author:

హిందూ సంప్రదాయంలో పెళ్లి అనేది అత్యంత ప్రవిత్రమైన కార్యక్రమం,ఒక శుభ ముహూర్తాన మూడు ముళ్లతో ఇద్దరు దంపతులు ఒక్కటవుతారు, ఆ సమయంలో పెద్దలు అందరు జీవితంలో ఎటువంటి సమస్యలు, గొడవలు ఉండకుండా పిల్ల పాపలతో సంతోషంగా జీవించాలని దంపతులిద్దరిని ఆశీర్వదిస్తారు, ఇద్దరు దంపతులు ఒక్కటయ్యే శుభ ముహూర్తాన దేవ‌త‌లు, దేవుళ్లు కూడా ఆశీర్వ‌దిస్తారు,హిందూ సంప్రదాయంలో భార్యభర్తలని శివపార్వతులతో పోలుస్తారు, అందుకే భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక ప్రదేశంలో ఉండే శివాలయాన్ని దర్శిస్తే వారి జీవితంలో ఎటువంటి సమస్యలైన వెంటనే పరిష్కారమవుతాయి అని పెద్దలు భావిస్తారు.

Shiva Parvathi Marriage

ఈ శివాలయం ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లా త్రియుగినారాయ‌ణ్ అనే గ్రామంలో కొలువై ఉంది, ఈ పురాత‌న శివాలయానికి వేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉంది. ఈ ప్రదేశంలో శివుడిని పెళ్లి చేసుకోవాలని పార్వతి దేవి చాలా సంవ‌త్స‌రాల పాటు త‌ప‌స్సు చేసింద‌ట‌, పార్వతి దేవి తపస్సుకు మెచ్చి శివుడు ఈ ప్రదేశంలోనే విష్ణువు సమక్షంలో పార్వతి దేవిని వివాహం చేసుకున్నాడ‌ట‌, అప్పటి నుండి ఈ ప్రదేశం పెళ్ళైన దంపతులకు పుణ్య క్షేత్రంగా మారింది.ఇక్క‌డ పెళ్లి చేసుకునే వారితోపాటు పెళ్ల‌యిన వారు కూడా ఈ దేవాల‌యాన్ని సంద‌ర్శిస్తే వారి దాంప‌త్య క‌ష్టాలు తొల‌గుతాయ‌ట‌. దీంతోపాటు మ‌రెన్నో విశేషాలు ఈ ఆల‌య చ‌రిత్ర‌లో దాగి ఉన్నాయి.

హ‌వ‌న్ కుండ్: దేవాల‌యంలో ఉన్న హ‌వ‌న్ కుండ్ అనే ప్ర‌దేశంలో బ్ర‌హ్మ దేవుడి సాక్షిగా పార్వ‌తి, శివుడు ఒక‌ట‌య్యార‌ట‌. ఇదే ప్ర‌దేశాన్ని దంప‌తులు ద‌ర్శించుకుంటే వారి స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌.

Shiva Parvathi Marriage

అఖండ్ ధుని: ఈ శివాల‌యంలో ఉన్న అఖండ్ ధుని అనే ప్ర‌దేశంలో ఎల్ల‌ప్పుడూ మంట యాగాగ్ని రూపంలో మండుతూనే ఉంటుంద‌ట‌. ఇక్క‌డే పార్వ‌తీ శివులు మంట చుట్టూ 7 అడుగులు న‌డిచార‌ని చెబుతారు. అందుకే ఈ దేవాల‌యానికి అఖండ్ ధుని ఆల‌యం అనే పేరు కూడా వ‌చ్చింద‌ట‌.

Shiva Parvathi Marriage

బ్ర‌హ్మ కుండ్: శివాల‌యంలోనే ఉన్న నీటి కొల‌నులో శివ పార్వ‌తుల క‌ల్యాణం త‌రువాత బ్ర‌హ్మ స్నానం చేశాడ‌ట‌. అందుకే ఈ కొల‌నుకి బ్ర‌హ్మ కుండ్ అనే పేరు వ‌చ్చింది. ఈ కొల‌నులో మునిగితే త‌మ పాపాలు తొల‌గిపోతాయ‌ని భ‌క్తులు న‌మ్ముతారు.

Bramha_Kund 1
విష్ణు కుండ్: ఆల‌యంలోనే ఉన్న మ‌రో కొల‌నులో విష్ణువు స్నానం చేశాడ‌ట‌. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్వ‌తీ దేవికి సోద‌రుడిగా వ్య‌వ‌హరించి అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌డంతోపాటు శివ పార్వ‌తుల క‌ల్యాణం కూడా జ‌రిపించాడ‌ట‌. అందుకే ఈ కొల‌నును విష్ణు కుండ్ అని వ్య‌వ‌హ‌రిస్తారు.

Vishnu Kund
రుద్ర కుండ్: దేవాల‌యంలో ఉన్న మ‌రో నీటి కొల‌నులో శివుడు ఇత‌ర దేవ‌త‌ల‌తో క‌లిసి స్నానం చేశాడ‌ట‌. అందుకే దీన్ని రుద్ర కుండ్ అని పిలుస్తారు. శివుడు త‌న వివాహానికి ముందు ఇక్క‌డ స్నాన‌మాచ‌రించాడ‌ట‌. అయితే ఇక్క‌డ స్నానం చేసే దంప‌తుల‌కు సంతాన స‌మ‌స్య తొల‌గిపోతుంద‌ని విశ్వ‌సిస్తారు.

Shiva Parvathi Marriage

(Visited 23,017 times, 1 visits today)