Home / Devotional / అద్దంలో కనిపించే త్రయంబకేశ్వరుడి గురించి తెలుసుకోండి.

అద్దంలో కనిపించే త్రయంబకేశ్వరుడి గురించి తెలుసుకోండి.

Author:

అన్నీ దేవాలయాలలో దేవుడిని విగ్రహ రూపంలో చూస్తాము, కానీ మహారాష్ట్రంలోని నాసిక్ 35 కి.మీ దూరంలో ఉన్న త్రయంబక్ అనే ఊరి గుడిలో మాత్రం మనకు అద్దంలో దర్శనమిస్తున్నాడు. శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఒకటి. ఇక్కడ భక్తులు స్వామివారిని అద్దంలోనే దర్శించుకుంటారు. ఈ గుడిలోని శివలింగం భూమికి ఎనిమిది అడుగుల లోపల ఉండడం వలన భక్తులు దర్శించుకోవదానికి అనుగుణంగా అద్దాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.

trimbakeshwar

త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గురించి ప్రచారంలో ఉన్న కథ : ఒకసారి త్రయంబక్ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడ్డాయి. ప్రజలు తినడానికి, త్రాగడానికి ఇబ్బంది పడుతున్న రోజులు. అప్పుడు గౌతమ మహాముణి వరుణ దేవుని కొరకు తీవ్ర తపస్సు చేశాడు. గౌతముడి తపస్సుకు మెచ్చి వరుణ దేవుడు ప్రత్యేక్షమై ఒక చిన్న గుంటలో అక్షయజలం ఆవిర్భవిస్తుందని వరమిచ్చాడు. అలా వరుణ దేవుని వరంతో ఉద్బవించిన జలమే తరువాత గౌతమి నదిగా రూపొందింది. ఆ నది అక్కడి ప్రజల క్షామభాదలను తీర్చింది. దానితో తపస్సు చేసి అందరి ఆకలి, దప్పికలు తీర్చిన గౌతముడి కీర్తి నలుదిశల వ్యాపించింది. ఇది చూసి కొందరు మునులు ఓర్వలేక ఒక మాయ గోవును సృష్టించి గౌతముని పచ్చని పంట పొలాలలోకి వదిలారు. అది చూసిన గౌతముడు చేతిలో ఉన్న గడ్డి పరకతో ఆ మాయ గోవును అదిలించాడు. దానితో ఆ మాయ గోవు చనిపోయింది. గోహత్య పాపం గౌతమునికి కలిగిందని, అతని ముఖం చుస్తే చూసిన వారికి అదే పాపం కలుగుతుందని మునులు ప్రజలకు ప్రచారం చేస్తూ గౌతముని నిందించారు .

తన వలనే గోహత్య జరిగిందని కుమిలిపోతున్న గౌతముడు చివరికి ఆ మునుల దగ్గరికి వెళ్లి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పండి అని వేడుకుంటాడు. వారు చెప్పినట్లు బ్రహ్మగిరి పర్వతానికి ప్రదక్షిణ చేశాడు. కోటిలింగాలను ఆరాధించాడు. గౌతముని భక్తి కి మెచ్చిన గంగా శంకరులు ప్రథ్యక్షమై గౌతముని గోహత్యాపాపాన్ని తొలగించి, గౌతముని కోరిక మేరకు ఈ గుడిలో కొలువై వున్నారు. ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే భక్తులకు ముక్తి లభిస్తుందని ఇక్కడికి వచ్చిన వారి విశ్వాసం.

(Visited 1,093 times, 1 visits today)